రాష్ట్రీయం

యుద్ధం వస్తే ప్రపంచపటంలో పాక్ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 22: యుద్ధం వస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. 370 ఆర్టికల్ రద్దు తరువాత జమ్ము-కాశ్మీర్ ప్రాంతంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జేఎన్‌టీయూ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని వన్ నేషన్, వన్ కాన్సిట్యూషన్ జనజాగరణ సభలోమాట్లాడారు. దేశ సమైక్యత సమగ్రతలను పరిరక్షిస్తూ ప్రపంచ దేశాల్లో దేశ గౌరవాన్ని రక్షించగల సత్తా మోదీకే ఉందని 130కోట్ల ప్రజలు ఆమోదించి రెండోసారి కూడా గణనీయమైన విజయాన్ని అందించి దేశ రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్య పాలన దిశగా కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వ విజయాలను వివరించే నిమిత్తం పర్యటిస్తున్నానని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో బీజేపీ పాలన తిరిగి కొనసాగదంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రజలే సరైన సమాధానమిస్తూ భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాన్ని అమలుచేసే క్రమంలో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రపంచదేశాల్లో భారతదేశ గొప్పదనాన్ని అంకితభావాన్ని చాటామన్నారు. ఓట్లు, సీట్లు అధికారం కోసం వెంపర్లాడే లక్షణం బీజేపీలో లేదని, దేశ సమగ్రతే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ 100 రోజుల పాలనలో అద్భుత కార్యక్రమాలను తీసుకురావడం ద్వారా ప్రజాభీష్టం మేరకు పాలనపై దృష్టి సారించామన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకువచ్చామని, ఆర్టికల్ 370 రద్దు చేశామని, ఉగ్రవాదంపై దర్యాప్తు చేసే అధికారాన్ని కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఆర్టికల్ 370 ఏర్పాటు వద్దంటూ అందరూ అభ్యంతరాలు చెప్పినా అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన వ్యక్తిగత ఆలోచనతో అమలు చేయడం ద్వారా భారతదేశానికి తీరని నష్టాన్ని కలుగజేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 370 ఆర్టికల్ వ్యతిరేకించి నెహ్రూ ప్రభుత్వంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని జమ్ము-కాశ్మీర్‌కు వెళ్లాలంటే అనుమతులు అవసరమన్న విషయాన్ని తోసిపుచ్చుతూ భారతీయులుగా తమకు అధికారం ఉందని గుర్తు చేస్తూ జమ్ము-కాశ్మీర్ భూభాగంలో అడుగుపెట్టిన వెంటనే శ్యామ్ ప్రకాష్ ముఖర్జీని అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టి అదే జైల్‌లో తుది శ్వాస విడిచారని గుర్తు చేశారు. పీఓకే ప్రాంతాన్ని కూడా తప్పక భవిష్యత్తులో స్వాధీనం చేసుకుంటామని గతంలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి అగ్రతారలు కాశ్మీర్ అందాలను తమ చిత్రాల ద్వారా ప్రజలకు చూపించారని, నేడు రామోజీ ఫిల్మ్ సిటీలొ సెట్‌ల ద్వారా ప్రజలకు చూపిస్తున్నారని ఇకపై నిర్భయంగా చిత్రసీమ తన కార్యక్రమాలను నెరవేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. వేదికపై జిల్లా అధ్యక్షులు యెనిమిరెడ్డి మాలకొండయ్య, భాజాపా నాయకులు పైడా కృష్ణమోహన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సమయవంతుల శ్రీనివాసరావులు పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కాకినాడ నగర పాలక సంస్థ భాజాపా ఫ్లోర్ లీడర్ సాలగ్రామ లక్ష్మిప్రసన్న ఘనంగా సత్కరించారు. కాకినాడ పర్యటనకు వచ్చిన కిషన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులున్నారు.

*చిత్రం...సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి