రాష్ట్రీయం

భాషను బలవంతంగా రుద్దకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం మంచిది కాదని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. విశాఖలో ని లోక్‌నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యా ప్తంగా హిందీ భాష అమలుపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పం దించారు. ప్రజాస్వామ్య విధానంలో ఒకే దేశం, ఒకే భాష అమలు అసాధ్యమని అభిప్రాయపడ్డారు. వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ భాషలు ఆచరణలో ఉన్నాయని, వీటి స్థానే హిందీని తప్పనసరి చేయడం సహేతుకం కాదన్నారు. హిందీ భాషతో దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సంచరించవచ్చన్నారు. అమిత్‌షా భావం మంచిదే కానీ భావ వ్యక్తీకరణలో తేడా వల్లే గందరోగళ పరిస్థితులు తలెత్తాయన్నారు. దీనిపై రాద్ధాంతం అవసరం లేదని, భాష కోసం ఉద్యమాలు చేయాల్సిన పని కూడా లేదన్నారు. హిందీ సరిగా రాకపోవడం వల్లే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో రాణించలేకపోయారని యార్లగడ్డ అభిప్రాయపడ్డారు. తెలుగు భాషను పటిష్టం చేసేందుకు ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్