రాష్ట్రీయం

జూరాలకు కొనసాగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 14: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద నీటి ఉద్ధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.380 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 1.97 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 13 గేట్లను తెరిచి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి గేట్లద్వారా 1,23,364, విద్యుత్ ఉత్పత్తికి 36,217, నెట్టెంపాడుకు 1500, భీమా లిఫ్ట్-2కు 750, కోయిల్‌సాగర్‌కు 630, సమాంతర కాలువకు 650, జూరాల కుడి, ఎడమ కాలువలకు 1915 క్యూసెక్కుల చొప్పున 1,64,393 క్యూసెక్కులను వదులుతున్నారు. అదేవిధంగా నారాయణపూర్ జలాశయంలో 31.55 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 80వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 16,600 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయంలో 120.52 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 1,20,480 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 1,16,519 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు.