రాష్ట్రీయం

సికింద్రాబాద్-గౌహతి మధ్య 20 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ - గౌహతి- సికింద్రాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. (02513- 02514) ఈ రైళ్లు ఆగస్టు 29న ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 5, 12, 19, 26, అక్టోబర్ 3, 10, 17, 24, 31వ తేదీల్లో రైళ్లను ఏర్పాటు చేశారు. ఆగస్టు 29న (గురువారం) సికింద్రాబాద్‌లో ఉదయం 5.40 గంటలకు బయలుదేరి శనివారం (31వ తేదీ) ఉదయం 8.45 గంటలకు గౌహతికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్ - కొచ్చివేలి (07115) మధ్య నిడిచే ప్రత్యేక రైలును 24వ తేదీన రద్దు చేశారు. పర్లీ- మీర్జా ( 51425- 51426) మధ్య నడిచే ప్యాసింజర్ రైలును ఈనెల 24, 28వ తేదీల్లో రద్దు చేశారు.