రాష్ట్రీయం

‘మహాత్మా..పసిపిల్లలపై అత్యాచారాలు ఆపించు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా నడిచినపుడే స్వాతంత్య్రం వచ్చినట్టు అని ఆనాడు గాంధీజీ చెప్పారని, కానీ ప్రస్తుత సమాజంలో పగలు కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి దాపురించిందని భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎన్ జ్యోతి , ప్రధానకార్యదర్శి పుస్తేల సృజన పేర్కొన్నారు. తల్లిపక్కన పడుకున్న తొమ్మిది నెలల పసిగుడ్డును కూడా వదలని కామాంధులు ఉన్న సమాజంలో ఓ మహాత్మా మమ్మల్ని కాపాడు అని జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి రాఖీ కట్టి నేతలు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై పసిపిల్లలపై వరుస ఘటనలతో భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని వీటిని అరికట్టడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.