రాష్ట్రీయం

అర్హులకు ఇళ్ల స్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 14: భూముల సమగ్ర రీసర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో నెరవేరాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను గుర్తించాలని సూచించారు. భూముల సర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నారు. ఉగాదికి నెలరోజుల ముందే భూములు సిద్ధం చేసేందుకు కసరత్తు జరుపుతున్నామని, ఇప్పటి వరకు 23వేల 448 ఎకరాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో 20వేల 800, పట్టణ ప్రాంతాల్లో 2500 ఎకరాల భూమిని పరిశీలనలో ఉన్నట్లు వివరించారు. గ్రామాల్లో 14.06 లక్షల మంది, అర్బన్ పరిధిలో 12.69 లక్షల మంది నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భూమితో 9లక్షల మందికి స్థలాలు మంజూరు చేయవచ్చని పట్టణాల్లో మరో రెండు లక్షల మందికి సరిపోను భూములు ఉన్నాయని ఇంకా 15.75 లక్షల మందికి అవసరమైన భూమిని సేకరించాల్సి ఉందని వివరించారు. ఇందుకు అవసరమైన భూ సేకరణపై దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్ర నాధ్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్‌ఎస్ రావత్, మన్మోహన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి