రాష్ట్రీయం

రివర్స్ టెండరింగ్ నష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం మంచిది కాదని, దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోపాటు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలన్న ప్రతిపాదనపై మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమైన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసరంగా సమావేశమై చర్చించింది. మసాబ్ ట్యాంక్‌లోని కృష్ణా, గోదావరి భవన్‌లో ఐదు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పాల్గొని తాజా పరిణామాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేస్తూ, పనులను ఆపేయాలని కాంట్రాక్టర్‌కు ఏపీ ప్రభుత్వం నోటీస్ ఇవ్వడం, అలాగే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం వల్ల జరిగే లాభనష్టాలపై ప్రధానంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఆర్‌కే జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చర్చించిన విషయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్ట్ వ్యయం పెరగడమే కాకుండా నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని జైన్ అభిప్రాయపడ్డారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీ పని తీరు కూడా సంతృప్తికరంగా ఉందని జైన్ కితాబు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు జరిగిన పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ నీటిపారుదల శాఖను కోరినట్టు తెలిపారు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఏపీ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ అథారిటీ సూచించిందన్నారు. ఈ సమావేశంలో పునర్నిర్మాణం, పునరావసం ప్యాకేజీలపై కూడా చర్చించినట్టు ఆర్ అండ్ ఆర్ ప్రత్యేక అధికారి రేఖారాణి తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజికి రూ.32 వేల కోట్లు అదనంగా అవసరం అవుతాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే వరదలపై కూడా చర్చించినట్టు తెలిపారు.
చిత్రం...సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఆర్‌కే జైన్