రాష్ట్రీయం

జల విద్యుత్ కేంద్రం పవర్ కెనాల్‌కు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వై.రామవరం, ఆగస్టు 12: తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని డొంకరాయి ఏపీ జెన్కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పవర్ కెనాల్‌కు సోమవారం తెల్లవారుజామున భారీ గండి పడింది. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనంతరం పవర్ కెనాల్ ద్వారా 4500 క్యూసెక్కుల నీరు పోర్‌బే రిజర్వాయరు ద్వారా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లి, మరో 440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ పవర్ కెనాల్ నుండి నీరు వెళ్లే సమయంలో గండి పడింది. డొంకరాయి పోలీసు స్టేషన్ పక్కనుండే పవర్ కెనాల్ వెళుతుండటంతో రాత్రి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గండి కారణంగా వస్తున్న నీటి శబ్ధాన్ని విని, సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గండి సమాచారాన్ని ఏపీ జెన్కో అధికార్లకు అందించారు. వెంటనే ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విఎల్ రమేష్, సిబ్బంది స్పందించి, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతోపాటు పవర్ కెనాల్ గేట్లను మూసివేశారు. దీనితో ప్రవాహ ఉద్ధృతి తగ్గి, డొంకరాయి గ్రామానికి ముప్పుతప్పింది. కాగా గండి పడిన ప్రదేశంలో పక్కనే కొండవాగు ఉండటంతో పవర్ కెనాల్ నుండి ఉద్ధృతంగా వస్తున్న నీరంతా ఆ కొండవాగులోకి చేరింది. దీనితో డొంకరాయి గ్రామానికి పెద్ద ముప్పుతప్పింది. కొండవాగు పక్కనే కాక మరో ప్రాంతంలో గండిపడివుంటే డొంకరాయి గ్రామం పూర్తిగా జలమయమై వుండేది. ఇప్పటికే గండి కారణంగా డొంకరాయి మార్కెట్ పరిసరాల్లోకి నీరుచేరింది.
డొంకరాయి, పొల్లూరు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఏపీ జెన్కోకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే అవకాశముంది. ఈ విషయమై ఈఈ రమేష్‌ను వివరణ కోరగా, గండి వేగంగా పూడ్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.కాగా గండి పూడ్చడానికి సమారు నెల రోజులు పట్టవచ్చని సమాచారం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిరంతరాయంగా జరుగుతున్న నీటి విడుదల కారణంగా ఈ గండి పడివుండవచ్చని భావిస్తున్నారు.
చిత్రం...డొంకరాయి పవర్ కెనాల్‌కు గండి పడిన ప్రదేశం