రాష్ట్రీయం

ఎస్‌బిహెచ్ నిధుల బదలాయింపు స్కామ్‌పై సిబిఐ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: హైదరాబాద్‌లో మల్కాజిగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో నిధుల దుర్వినియోగం, తప్పుడు పద్ధతుల్లో నిధుల బదలాయింపు అభియోగాలపై సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అల్విన్ లిమిటెడ్ వాచెస్ లిమిటెడ్‌కు చెందిన పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సిబిఐ న్యాయవాది పి కేశవరావు వాదనలు వినిపిస్తూ ఈ స్కాంకు దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో 12 బ్యాంకులకు సంబంధం ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఇదే తరహాలో నిధుల బదలాయింపు స్కాం చోటుచేసుకుందన్నారు. అనంతరం హైకోర్టు ఈ కేసును త్వరితగతిన విచారించి దోషులను అరెస్టు చేయాలని ఆదేశించింది. ఎప్పటికప్పుడు కేసు పురోగతిని కోర్టుకు తెలియచేయాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో ఖమ్మం జిల్లా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె శ్రీకాంత్, ఎం శ్రీనివాసరావు, సాయికుమార్ తదితరులకు బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ రాజా ఎలాంగో నిరాకరించారు.