రాష్ట్రీయం

అమరావతికి ఏఐఐబీ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : రాజధాని అమరావతికి రుణ మంజూరుకు మరో బ్యాంక్ వెనుకడుగు వేసింది. కొద్దిరోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ రుణ ప్రతిపాదన విరమించుకున్న నేపథ్యంలో తాజాగా ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో రాజధానిలో వౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన 14 వందల కోట్ల రుణానికి బ్రేక్ పడింది. అమరావతి నిర్మాణానికి 200 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు గతంలో ఏఐఐబీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ తరహాలోనే రుణ మంజూరులో వెనక్కు తగ్గింది. రాజధానిపై ఫిర్యాదులు అందుతున్నాయని దీనిపై విచారణ జరపాలని అంతకు ముందు ప్రపంచ బ్యాంక్ భావించింది. ఇందుకు అప్పట్లో కేంద్రం తిరస్కరించింది. దేశంలో రాజధానులపై క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుకునేందుకు విదేశీ బ్యాంక్ లకు అవకాశమివ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో ప్రపంచ బ్యాంక్ రాజధాని ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే ఏపీలో నూతన ప్రభుత్వం చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ వల్లే ప్రపంచ బ్యాంక్ రుణాన్ని రద్దు చేసుకుందని టీడీపీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై
శాసనసభ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. దీనికి రాజకీయ రంగు పులుముకోవటంతో రాజధాని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలోజరిగిన అవినీతిని వెలికితీస్తామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రపంచ ద్రవ్య సంస్థలు అమరావతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని, పనులు నిలిచిపోవటంతో పలువురు ఉపాధి కోల్పోతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. రాజధాని పనులు నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రకటించలేదని అవినీతి లెక్కలు తీస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో రాజధానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐఐబీ తాజా నిర్ణయంతో అమరావతి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయనేది స్పష్టమవుతోంది.