రాష్ట్రీయం

కలసే సాగుదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అదే విధానాన్ని అవలంభిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. శనివారం ప్రగతిభవన్‌లో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన ముచ్చటించారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సహా సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని కేసీఆర్, జగన్ నిర్ణయించారు. అంతకుముందు జగన్ దంపతులకు ఆయన ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని ఆయన అన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని తాము మొదటి నుంచి భావిస్తున్నామన్నారు. తాను స్వయంగా మహారాష్టక్రు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసినట్లు చెప్పారు. ఏళ్లతరబడి జలవివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై తానే చొరవ తీసుకున్నట్లు చెప్పారు. వివాదాలు పరిష్కరించుకోవడం రెండు రాష్ట్రాలకు మేలని చెప్పామని, దీని వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులను నిర్మించుకుంటున్నామన్నారు. ఆంధ్రాతో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది తమ విధానమన్నారు. రెండు రాష్ట్రాలకు మేలు కలిగించే విధంగా ఇరువురు కలిసి పని చేస్తామని కేసీఆర్ ప్రతిపాదించారు. గోదావరి నది నుంచి ప్రతి ఏటా 3500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలవన్నారు. మిగతా నీరంతా ఏపీ వాడుకునే వీలుందన్నారు. ప్రకాశం బ్యారేజీ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వాలానే గోదావరి నీటిని పంపించవచ్చన్నారు. దీంతో యావత్ రాయలసీమనుసస్యశ్యామలం చేయవచ్చన్నారు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చన్నారు.