రాష్ట్రీయం

మూడేళ్లలో పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 8: బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని 2018 నాటికి పూర్తిచేసి తీరుతామని సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని మంగళవారం సందర్శించిన ముఖ్యమంత్రి హెడ్‌వర్క్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రాష్ట్రం ఖర్చుచేసిన రూ.2,250 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, అయితే కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు తక్కువగా ఉన్నందున ఇప్పటి వరకు రాష్ట్రం ఖర్చుచేసిన రూ.2,250 కోట్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఇది జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేస్తామన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రాజెక్టు పూర్తిచేయాలనే సంకల్పం బలంగా ఉన్నందున ఇప్పటికే తాను ఆరేడుసార్లు ఇక్కడకు వచ్చానని చెప్పారు.ఇది సున్నితమైన ప్రాజెక్టు అయినందున, భూ సేకరణ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రాజెక్టు స్పిల్‌వే, హెడ్‌వర్క్స్ నిర్మాణం జరిగే ప్రాంతంలోని ఏడు గ్రామాలను తరలించడానికి కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే నాలుగు గ్రామాల తరలింపు సాధ్యమైందని, మిగిలిన చేగొండపల్లి, రామయ్యపేట, పైడిపాక గ్రామాల ప్రజలను కూడా త్వరలో తరలిస్తామని చెప్పారు. ప్రాజెక్టు డయాఫ్రం నిర్మాణం కోసం ఇప్పటికే బాబర్, ఎల్ అండ్ టి సంస్థలను ఏజన్సీలుగా నియమించామని, వారికి అడ్వాన్సులు కూడా చెల్లించామని, త్వరలో పనులు చేపడతారన్నారు. కుడి ప్రధాన కాలువలో ఆరు ప్యాకేజి పనులు చురుకుగా జరుగుతున్నాయని, ఎడమ ప్రధాన కాలువలో మూడు ప్యాకేజిల్లో పనులు నత్తనడకగా సాగుతున్నాయన్నారు. ఈ నెల నుండి ఎంత పనులు జరిగిందీ, ఎంత జరగాల్సి ఉన్నదీ నెలవారీ నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తిచేయడానికి, భూసేకరణ పూర్తిచేయడానికి ప్రతి రెండు మండలాలకు ఒక ఐఎఎస్ అధికారిని నియమించామన్నారు. ప్రాజెక్టు కోసం ఇంకా 50 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. ఊహించని విధంగా నూతన భూసేకరణ చట్టం రావడంవల్ల నిర్మాణ వ్యయం బాగా పెరిగిందన్నారు.
ప్రాజెక్టుకు సంబంధించి 10.80 కోట్ల క్యూబిక్ మీటర్ల నిర్మాణ పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవరం 1.55 కోట్ల క్యూబిక్ మీటర్లు మాత్రమే చేయగలిగామని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేయడానికి అదనపు యంత్ర సామాగ్రి వచ్చిందని, నిర్వాసితులు సహకరించాలని కోరారు. ప్రాజెక్టు పనుల వేగవంతానికి ఎప్పటికప్పుడు కేబినెట్ సమావేశంలో చర్చిస్తూనే ఉన్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర స్ర్తి,శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఎంపిలు తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చిత్రం.. ఇటుకలకోట వద్ద గోదావరి జలాలు పోలవరం కుడి కాలువలో కలిసేచోట పూజలు నిర్వహిస్తున్న సిఎం చంద్రబాబు