రాష్ట్రీయం

మద్యం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ స్వర్ణబార్ అండ్ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న కల్తీమద్యం ఘటనపై పలు కోణాల్లో విచారణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణలంక ప్రాంత ఎక్సైజ్ సిఐ వెంకటరమణను సస్పెండ్ చేసేందుకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. ప్రస్తుతం ఆయనను విధుల నుంచి తప్పించారు. ముందుజాగ్రత్త చర్యగా రాష్టవ్య్రాప్తంగా ఒరిజినల్ చాయిస్, రాయల్ స్టాగ్, ఓల్డ్ అడ్మిరియల్ బ్రాందీ, బ్యాగ్‌పైపర్, డైరక్టర్ స్పెషల్, ఓల్డ్ ట్రావెన్, ఎంసి విస్కీ, ఎంసి బ్రాందీ, ఇంపీరియల్ బ్లూ మొత్తం తొమ్మిది బ్రాండ్లను అధికారులు సీజ్ చేసారు. వీటి అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తూ శాంపిల్స్ సేకరణలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా, కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు ఆదేశాల మేరకు జిల్లాలోని మద్యం దుకాణాలన్నింటిని రెండోరోజైన మంగళవారం కూడా మూసివేశారు. రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు కలిసి ప్రతి దుకాణంలో ఉన్న స్టాక్స్‌ను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర డిజిపి జెవి రాముడు, ఎక్సైజ్ కమిషనర్ ఎంకె మీనా వేర్వేరుగా సంఘటనా స్థలాన్ని సందర్శించడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటికి మొత్తం 9మందిపై కేసులు నమోదు చేశారు. లైసెన్స్‌దారులైన నలుగురితోపాటు షాపు మేనేజర్, మరో ముగ్గురు సిబ్బందిపై ముందుగా కేసులు దాఖలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కూడా కేసు నమోదు చేశారు. ఒక ఆటో డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 328 కింద 9వ నిందితునిగా విష్ణుపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వకంగానే మద్యంను కల్తీచేసి పలువురి ప్రాణాలు హరింపచేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణతో ఈ కేసు దాఖలైంది. కల్తీమద్యం సేవించి మరణించిన ఐదు మృతదేహాలకు మంగళవారం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. తదుపరి పరీక్షల నిమిత్తం కొన్ని కీలకమైన శరీర భాగాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించారు.