రాష్ట్రీయం

ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదుల విభాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలు కూడా తమకు ఎదురయ్యే సమస్యలను ఈ విభాగానికి నివేదించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికలు జరిగే సమయంలో 24 గంటల పాటు ఈ విభాగం పనిచేస్తుందన్నారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040-2980 2895/2980 2897. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు అసరమైన చర్యలు తీసుకుంటారని అశోక్ కుమార్ మంగళవారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ కార్యాలయంలో అభ్యర్థులు, పార్టీల నేతలు నేరుగా కూడా ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు.