రాష్ట్రీయం

గ్రామీణాభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: గ్రామాల్లో మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు, వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, ఫాం పాండ్స్ ఏర్పాటుపై అన్ని శాఖలు కలిసి దృష్టి పెట్టాలని, ఈ కార్యక్రమాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమన్వయపరుచుకోవాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఇజిఎ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు, శాఖాధిపతులతో మంగళవారం విజయవాడలోని తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తాను చేపట్టిన జనచైతన్య యాత్రల అనుభవాలను వివరించారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు- పురోగతిపై ఆర్థిక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, సమీక్షించాలని సిఎస్‌ను కోరారు. గ్రామాల్లో ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణంపై ప్రజల నుంచి సంతోషం వ్యక్తమవుతోందన్నారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో రహదారుల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. దారిద్య్రరేఖకు దిగువన వున్న కుటుంబాలకు పెన్షన్లు, బియ్యం సక్రమంగా అందుతున్నాయని, సంక్షేమ కార్యక్రమాలను మరింతగా నిర్వహించాలన్నారు. నెలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం బహుళ ప్రజాదరణ పొందిందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బిసి ఉప ప్రణాళిక కింద నిధులను సద్వినియోగం చేస్తున్నామన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎ నిధులతో ఫాం పాండ్స్ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మరోవైపు ఎన్‌ఆర్‌ఇజిఎ, ఉప ప్రణాళికల పనులు పురోగతిలో ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి సిఎం దృష్టికి తీసుకువచ్చారు.