రాష్ట్రీయం

జడ్పీ ఎన్నికలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయమే లక్ష్యమని, ఈ దిశగానే మండల, జిల్లా ప్రాదేశిక సభ్యుల ఎన్నికల కోసం అన్ని జిల్లాలకు పీసీసీ సమన్వయకర్తలను నియమించామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ సమన్వయకర్తలు సంయుక్తంగా ఈ నెల 16, 17 తేదీలలో సమావేశాలు ఏర్పాటు చేసి జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎంపికపై చర్చించాలని ఉత్తమ్ ఆదేశించారు. చివరన ఈ నెల 18న జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేసి, 19న టీపీసీసీకి అందజేయాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాకు సమన్వయకర్తలుగా డీసీసీ అధ్యక్షుడు భార్గవ దేశ్‌పాండే, పీసీసీ సమన్వయకర్తగా ప్రేమలత అగర్వాల్, ఆసిఫాబాద్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు కే. విశ్వప్రసాద్, పీసీసీ సమన్వయకర్తగా జనక్ ప్రసాద్, మంచిర్యాల జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల సురేఖ పీసీసీ సమన్వయకర్తగా నామిండ్ల శ్రీనివాస్‌ను నియమించారు. అదే విధంగా, నిర్మల్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు రామారావు పటెల్ పవర్, పీసీసీ సమన్వయకర్తగా అల్లం భాస్కర్, కరీంనగర్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యంజయ, సమన్వయకర్తగా మహేశ్‌గౌడ్, జగిత్యాల జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్, సమన్వయకర్తగా జి గంగాధర్, పెద్దపల్లి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు కొమురయ్య, సమన్వయకర్తగా యూసుఫ్ జాహీ నియమితులయ్యారు. సిరిసిల్ల జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, సమన్వయకర్తగా మధుకర్ యాదవ్, నిజామాబాద్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, సమన్వయకర్తగా గడ్డం ప్రసాద్‌కుమార్, కామారెడ్డి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు కైలాశ్ శ్రీనివాస్‌రావు, సమన్వయకర్తగా మసూద్ అహ్మద్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, సమన్వయకర్తగా హజ్మతుల్లా హుస్సేని నియామకం జరిగింది. భూపాలపల్లి జిల్లాకు డీసీసీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, సమన్వయకర్తగా బండి నర్సాగౌడ్, జనగామ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, సమన్వయకర్తగా జితేందర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు డీసీసీ అధ్యక్షురాలు
నిర్మలగౌడ్, సమన్వయకర్తగా ఆదం సంతోష్‌కుమార్, మెదక్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సమన్వయకర్తగా నగేశ్ మరదిరాజ్, సిద్దిపేట జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, సమన్వయకర్తగా ఆకుల రాజేందర్, వికారాబాద్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, సమన్వయకర్తగా అమరేందర్‌రెడ్డిని నియమించారు. మేడ్చల్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్, సమన్వయకర్తగా జువ్వాది ఇందిరారావు, రంగారెడ్డి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, సమన్వయకర్తగా ఎస్ జగదీశ్వర్‌రావు, మహబూబ్‌నగర్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు ఓమేదుల్లా కోత్వాల్, సమన్వకర్తగా ఫిరోజ్‌ఖాన్, వనపర్తి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు టి శంకర్ ప్రసాద్, సమన్వయకర్తగా జనార్థన్‌రెడ్డి, గద్వాల్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, సమన్వయకర్తగా వెంకటేశ్ ముదిరాజ్, నాగర్‌కర్నూల్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు వంశీచందర్‌రెడ్డి, సమన్వయకర్తగా బొల్లు కిషన్, సూర్యాపేట జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్, సమన్వయకర్తగా ఎంఏ ఫహీమ్, మహబూబాబాద్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డి, సమన్వయకర్తగా టి నిరంజన్, నల్లగొండ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, సమన్వయకర్తగా వినోద్‌రెడ్డికి అవకాశం దక్కింది. ఖమ్మం జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, సమన్వయకర్తగా ఇందిరా శోభన్, భువనగిరి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి, సమన్వయకర్తగా కైలాశ్‌కుమార్, కొత్తగూడెం జిల్లా సమన్వయకర్తగా సుదర్శన్ ప్రసాద్ తివారి, ములుగు జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు నల్లా కుమారస్వామి, సమన్వయకర్తగా శ్రీనివాస్‌రెడ్డి, నారాయణపేట జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి, సమన్వయకర్తగా సుధీర్‌రెడ్డిని నియమించినట్టు ప్రకటించారు.