రాష్ట్రీయం

పాఠశాల విద్యలో నీతి బోధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చాగంటి, పట్ట్భారాం, వర్లు, వరప్రసాదరెడ్డిలతో కమిటీ
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబర్ 7: పాఠశాల విద్యలో విద్యార్ధుల్లో నైతిక విలువలను ప్రబోధించి జీవిత లక్ష్యాలను గమ్యాలను గుర్తుచేసేందుకు తగిన శిక్షణ, నైపుణ్యాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వ్యవహరిస్తారు. కమిటీలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, హిప్నాటిస్టు, వ్యక్తిత్వవికాస నిపుణుడు బివి పట్ట్భారాం, డాక్టర్ ఎన్ వి వర్లు, శాంతా బయోటెక్ ఎండి కె వరప్రసాదరెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పాఠశాల విద్యలో సంస్కరణలకు ప్రణాళికలకు వ్యూహాత్మక విధాన సలహాలను మార్గదర్శకాలను సూచిస్తుంది, అంతర్జాతీయంగా అమలుచేస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటిపై తమ సలహాలను అందిస్తారు. 22 అంశాలపై ఈ కమిటీ చేసే సూచనలను సలహాలను సైతం ప్రభుత్వం వివరించింది.

సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరక్టర్ పోస్టు ఏర్పాటు
* ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరక్టర్ పోస్టును సృష్టిస్తూ ఎపి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ పోస్టు రాష్ట్ర విభజన సందర్భంగా అధికారితో సహా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడింది. దీంతో రాష్ట్ర అవసరాల దృష్ట్యా కొత్తగా సాంస్కృతిక శాఖ డైరక్టర్ పోస్టును సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఎఎస్‌ల పదోన్నతుల స్క్రీనింగ్‌పై కమిటీ నియామకం
* ఎపి ప్రభుత్వం వెల్లడి * ఇద్దరు పోలీస్ కమాండెంట్ల బదిలీ
హైదరాబాద్, డిసెంబర్ 7: అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు సూపర్ టైం స్కేల్‌తో కూడిన పదోన్నతుల కల్పనకు స్క్రీనింగ్ కమిటీని నియమిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ప్రధానకార్యదర్శి చైర్మన్ కాగా, సభ్యులుగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇద్దరు పోలీసు కమాండెంట్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు పోలీసు కమాండెంట్లను బదిలీ చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌బివిఆర్‌ఆర్ టిఎస్ పోలీసు అకాడమి అసిస్టెంట్ డైరక్టర్‌గా ఉన్న ఎన్.చంద్రవౌళిని కర్నూలు సదరన్ రీజియన్ హోమ్‌గార్డ్సు కమాండెంట్‌గా బదిలీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సదరన్ రీజియన్ కమాండెంట్‌గా ఉన్న మూసా బిన్ ఇబ్రహీంను టిఎస్ పోలీసు అకాడమి అసిస్టెంట్ డైరక్టర్‌గా బదిలీ చేసింది.