రాష్ట్రీయం

అభివృద్ధికి, అరాచకానికి మధ్య పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఈ సార్వత్రిక ఎన్నికలు అభివృద్ధికి అరాచకానికి మధ్య పోటీ అని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఆంధ్ర ద్రోహులతో అంటకాగుతున్న వైసీపీకి ఓటడిగే నైతిక అర్హత లేదన్నారు. పోలవరం పూర్తిచేసే తెలుగుదేశం పార్టీ కావాలా.. అడ్డంకులు పెట్టే వైకాపా కావాలా? రాజధాని నగర నిర్మాణం పూర్తిచేసే పార్టీ కావాలా.. అరటితోటలు దగ్ధంచేసే అరాచక వైసీపీ కావాలా? రాయలసీమకు నీళ్లిచ్చేది టీడీపీ అయితే ఫ్యాక్షన్ కక్షలు రెచ్చకొట్టి ప్రాణాలు బలిచేసే వైసీపీ కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. పోలవరంపై పిటిషన్లు వేసే వారికి ఏపీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ చంద్రబాబు మాట్లాడుతూ తాను ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని చెప్పారు. రైతులు, మహిళలు, యువత తోడ్పాటుతో ఎన్నికలు ఏకపక్షమవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నామినేషన్ల రోజే టీడీపీ గెలుపు ఖరారు కావాలని ఆకాంక్షించారు. అన్నివర్గాల లబ్ధిదారులను కలుపుకుని గెలుపులో అందర్నీ భాగస్వాములు చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలెగ్జాండర్‌కు పదిలక్షల మంది సైన్యం ఉన్నారని వీరిలో ప్రతి ఒక్కరూ తాము అలెగ్జాండర్ అని చెప్పుకునే వారని చరిత్ర గుర్తుచేశారు. అందుకే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి 65లక్షల మంది సైన్యం ఉన్నారని అసాధ్యాలను సుసాధ్యం చేస్తారన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ వ్యతిరేకుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. తటస్థులు, మేధావుల్లో ఆదరణ పెరిగిందన్నారు. వైసీపీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని, రాష్ట్రం అప్రతిష్ట పాలవుతుందని, దౌర్జన్యాలు, దాడులు పెచ్చరిల్లుతాయని హెచ్చరించారు. భూములు, ఆస్తులకు భద్రత ఉండదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డితో జగన్‌కు వైరాలు ఉన్నాయని గతంలో ఆయనపై చేయి చేసుకున్న దాఖలాలు ఉన్నట్లు తేలిందని, ఎంపీగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నాడు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ నుంచి హెచ్చరికలు రావడంతో వెనక్కు తగ్గాడన్నారు. మొదటి నుంచి జగన్ నుంచి వివేకా వేధింపులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఆయన హత్యోదంతాన్ని పక్కదారి పట్టించేదుకు ముందుగా గుండెపోటు డ్రామా ఆడారన్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చాక జగన్నాటకం సీన్ మారిందన్నారు. సిట్ విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయని, వివేకా హత్య కేసులో దోషుల్ని వదిలిపెట్టేదిలేదని స్పష్టం చేశారు. నిందితులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమని చెప్తూ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అంతా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.