రాష్ట్రీయం

తాగుబోతు డ్రైవర్లపై ఏం చర్యలు చేపట్టారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అదుపు చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించి, ఆ నివేదికను తమకు అందజేయాల్సిందిగా ఎపి, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. గత నెల 15న విజయవాడ శివారులోని గొల్లపూడి వద్ద వైద్య విద్యార్థుల బస్సు దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు చనిపోవడంపై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభు త్వం తరఫున హాజరైన న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ కోర్టుకు వివరణ ఇస్తూ ప్రభుత్వం రోడ్డు భద్రత విభాగాన్ని ఏర్పాటు చేసిందని, విద్యార్థుల మృతికి కారణమైన ధనుంజయ ట్రాన్స్‌పోర్టు లైసెన్సును రద్దు చేసిందని తెలిపారు. అంతేకాకుండా జాతీయ రహదారులపై వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు మద్యం తాగిందీ లేనిదీ నిర్ధారించే బ్రీథింగ్ అనలైజర్ పరికరాలను తమ అధికారులకు సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎపి ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరూ కోర్టుకు హాజరు కాకపోవడంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చే ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత మీపై లేదా అంటూ ఎపి లా ఆఫీసర్లను ఉద్దేశించి హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ కేసును వేసవి సెలవుల అనంతరం విచారణ చేపట్టేందుకు వాయిదా వేసింది.