రాష్ట్రీయం

హెచ్‌సియు వీసిని రీకాల్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే రీకాల్ చేయాలంటూ వామపక్షాల కార్యకర్తలు సోమవారం రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, వామపక్ష కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వామపక్ష కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. విసి అప్పారావును తొలగించాలంటూ ఆందోళనకు దిగడంతో సిపిఐ జాతీయ నేత నారాయణ సహ పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
హెచ్‌సియూలో విసి అప్పారావు తిరిగి బాధ్యతలు స్వీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వామపక్షాల నేతలు డాక్టర్ సుధాకర్, కె నారాయణ, పిఓడబ్ల్యు నేత సంధ్య, విమలక్క, శేఖర్‌తోపాటు విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సోమవారం ఉదయం పది గంటలకు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్‌భవన్ వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దీంతో వామపక్ష కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వావాదం, తోపులాట జరిగింది. దీంతో సిపిఐ అగ్రనేత నారాయణతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివక్ష కొనసాగుతుందని, విద్యార్థులను విభజించి పాలిస్తున్న విసి అప్పారావును తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ప్రధానిపై ఒత్తిడి తెచ్చి విసిని వెంటనే రీకాల్ చేయాలని కోరారు.