రాష్ట్రీయం

ఈనెలనుంచే కార్మికుల ఖాతాలో ఇపిఎఫ్ వడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: పది మంది పని చేసే కార్యాలయాల్లోనూ సిబ్బందికి ప్రావిడెంట్ ఫండ్ అమలు చేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మికులకు బోనస్ 3,500 రూపాయల నుంచి 7 వేల రూపాయలకు పెంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానిదని అన్నారు. శనివారం కేంద్ర మంత్రి దత్తాత్రేయ బర్కత్‌పురాలోని ఇపిఎఫ్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఇపిఎఫ్‌ను సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత యుపిఎ ప్రభుత్వ ఆస్తవ్యస్థ పాలనతో కార్మికుల నష్టపోయారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించామని చెపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, అవినీతి, కుంభకోణాలు లేవని ఆయన తెలిపారు. యుపిఎ ప్రభుత్వం 2011 సంవత్సరం ఫిబ్రవరి నుంచి 9 కోట్ల 23 లక్షల మంది కార్మికులకు, ఉద్యోగులకు ఇపిఎఫ్ వడ్డీని చెల్లించలేదని ఆయన విమర్శించారు. కాబట్టి తాము ఇపిఎఫ్ వడ్డీని ఈ ఏడాది ఏఫ్రిల్ 1వ తేదీ నుంచి చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు చెల్లించని వడ్డీ బకాయిలూ చెల్లిస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బోనస్‌ను 3,500 నుంచి 7 వేల రూపాయలకు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. 10 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లయితే ఇపిఎఫ్ వర్తించేలా చర్యలు తీసుకున్నామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఇపిఎఫ్ చట్టాన్ని సవరిస్తామని ఆయన వివరించారు.
బీడి కార్మికులను ఆదుకుంటాం
బీడి కార్మికుల కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. బీడి కట్టలపై పుర్రె గుర్తు తొలగించాల్సిందిగా కరీంనగర్ తదితర జిల్లాల నుంచి బీడి కార్మికులు నగరానికి వచ్చి దత్తాత్రేయకు వినతి పత్రం అందజేశారు. పుర్రె గుర్తుతో తమ వ్యాపారానికి భారీగా నష్టం వాటిల్లుతున్నదని వారు తెలిపారు. అందుకు దత్తాత్రేయ స్పందిస్తూ పుర్రె గుర్తు తొలగించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.