రాష్ట్రీయం

రోజాకు మరో అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఏడాదిపాటు ఆంధ్రా అసెంబ్లీనుంచి సస్పెండైన వైకాపా ఎమ్మెల్యే రోజాను ఈ నెల 6వ తేదీన జరిగే ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని కమిటీ నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కమిటీ సమావేశానికి హాజరవుతానని రోజా ప్రకటించారు. తాను గతంలో జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదని ఆమె పేర్కొన్నారు.
తాజాగా ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రోజా సస్పెన్షన్ వ్యవహారం దుమారం రేపిన సంగతి విదితమే. గత ఏడాది డిసెంబర్ 18న ఘటనకు సంబంధించి రోజాను అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏడాదిపాటు సస్పెండ్ చేసింది. అనంతరం రోజా గత నెలలో హైకోర్టు సింగిల్ జడ్జి ఎదుట అసెంబ్లీ తీర్మానాన్ని సవాలు చేశారు. రోజాను అసెంబ్లీ సమావేశాలకు అనుమతించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. అనంతరం రోజా తాజాగా సుప్రీంకోర్టులో ఈ కేసుపై పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంలో ఈ కేసు విచారణ ఈ నెల 4వ తేదీ సోమవారం రానుంది. ఈ నేపథ్యంలో రోజా 6వ తేదీ బుధవారం కమిటీ ఎదుట హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలు ఇవ్వడం, దీనికి సానుకూలంగా రోజా స్పందించడం గమనార్హం.