రాష్ట్రీయం

పదవుల పందేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: నామినేటేడ్ పోస్టుల భర్తీకి ఉగాది పండుగ నుంచి శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలకు దగ్గర పడుతుండటంతో ఇక నామినేటేడ్ పోస్టుల భర్తీలో ఏమాత్రం తాత్సారం చేయవద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. గత ఏడాది నుంచి వీటిని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావించినప్పటికీ ఏదో ఒక అవాంతరం ఎదురుపడటంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బడ్జెట్ సమావేశాలు కూడా ముగియడంతో ఇక పోస్టుల భర్తీ పట్ల ముఖ్యమంత్రి దృష్టి సారించారు. జిల్లాస్థాయిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలకు, జిల్లా గ్రంధాలయాల కమిటీ చైర్మన్, దేవాలయాల పాలక వర్గాలకు ఎంపిక చేసే బాధ్యతలను పార్టీ జిల్లా బాధ్యులు, సంబంధిత జిల్లా మంత్రుల సమన్వయంతో ప్రతిపాదనలు పంపించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. అయితే శాసనసభ బడ్జెట్ సమావేశాల వల్ల బిజీగా ఉండిపోయిన మంత్రులు ఆ దిశగా కసరత్తు చేయలేకపోయారు. ఈ సమావేశాల తర్వాత జిల్లాలకు వెళ్లిన మంత్రులు నామినేటేడ్ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. జిల్లా స్థాయి నామినేటేడ్ పోస్టులు మినహాయించి రాష్టస్థ్రాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులు నలబై వరకు ఉంటాయని ప్రాథమిక అంచన. వీటిలో కనీసం 15 నుంచి 20 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు కేబినేట్ హోదా కలిగి ఉన్నాయి. వీటి భర్తీకి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, అయితే పార్టీ ముఖ్యనేతలతో కూడా ఒక్కసారి చర్చించాక ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేబినేట్ హోదా కలిగిన కార్పొరేషన్ చైర్మన్ పోస్టులలో పార్లమెంటరీ కార్యదర్శులుగా పని చేసిన వారికి మొదటి ప్రాధాన్యతలో నియమించాకే ఇతరులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా ఆరుగురు ఎమ్మెల్యేలను నియమించగా, వారి ఎంపికను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో వారికి నామినేటేడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు పార్టీ ముఖ్యుల వద్ద ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు సమాచారం. పార్లమెంటరీ కార్యదర్శులుగా దాస్యం వినయ్‌భాస్కర్, గాదరి కిషోర్‌కుమార్, జలగం వెంకట్రావు, శ్రీనివాస్‌గౌడ్, కోవా లక్ష్మి, సతీష్‌కుమార్ ఆరుగురిని నియమించిన విషయం తెలిసిందే. వీరందరికీ ప్రాధాన్యత కలిగిన కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల్లో నియమించిన తర్వాతనే ఇతరులకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ఇవ్వేకాకుండా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ (టిడిడబ్ల్యుఎస్‌సి) చైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించే విషయం దాదాపు ఖరారు అయినట్టేనని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ వ్యవహారాల పిఆర్వోగా పని చేసిన శ్రవణ్‌కుమార్‌రెడ్డికి, అలాగే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నామినేటేడ్ పోస్టు ఇవ్వడం దాదాపు ఖరారు అయినట్టు తెలిసింది. వీరితో పాటు గత ఎన్నికల్లో వివిధ సమీకరణల వల్ల పార్టీ టిక్కెట్ దక్కని నేతలకు నామినేటేడ్ పోస్టుల్లో అవకాశం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చిన వారిలో 20 నుంచి 25 మంది దాకా ఉన్నారని తెలిసింది. వీరందరికి కూడా ప్రాధాన్యతా క్రమంలో ఉగాది నుంచి నామినేటేడ్ పోస్టుల్లో నియమించడానికి ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించినట్టు పార్టీ వర్గాల సమాచారం.