రాష్ట్రీయం

ఉద్యోగ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 20 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని ఒక సంవత్సరంలోగా భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శనివారం స్థానిక ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగింది. సుమారు ఆరు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేఖరులకు తెలియచేశారు. అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్, అభయ గోల్డ్ వగైరా మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా మోసపోయిన బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు విజయవాడలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అగ్రిగోల్డ్ బాధితులకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి జస్టిస్ సీతాపతి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అగ్రిగోల్డ్ ఆస్తులను ఈనెల 20, 21 తేదీల్లో మొదటి దశ వేలాన్ని పూర్తి చేయనున్నారు.
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ మోసాలను నిరోధించేందుకు రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22(బి)ని అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సెక్షన్‌ను అమలు చేయడం ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు సంక్రమిస్తుంది.
తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది వేడుకలు
తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెల ఎనిమిదవ తేదీన విజయవాడలో నిర్వహించాలని క్యాబినెట్ ఇర్ణయించింది. అదే రోజున అన్ని జిల్లాల్లో మంత్రులు ఉగాది వేడుకలను నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాల వారికి ఆరు లక్షల ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. పూలే, జగ్జీవన్‌రామ్ ఉత్సవాలను విజయవాడలోనే నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
524 రీచ్‌లు గుర్తింపు
రాష్ట్రంలో ఉచితంగా ఇసుక అందరికీ అందించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ఒక మొబైల్ యాప్‌ను ప్రభుత్వం తయారు చేస్తోంది. వినియోగదారులు మొబైల్ యాప్ కావల్సిన చోటికి, కావల్సినంత ఇసుకను రప్పించుకోడానికి అవకాశం ఉంటుంది. ఇసుక రవాణ చార్జీలను మాత్రం వినియోగదారులే చెల్లించుకోవలసి ఉంటుంది.
నీటి ఎద్దడి నివారణకు రూ.40 కోట్లు
ఈ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు 40 కోట్ల రూపాయల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వడదెబ్బలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం కలెక్టర్లను ఆదేశించింది. ఎండలు ఎక్కువగా ఉంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకూ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళలో కార్యకలాపాలను నిలిపివేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నీరు-చెట్టు కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, ఆయా ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసి జియో టాగింగ్ ద్వారా ఆ నిల్వల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజుకు 194 రూపాయల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ప్రతి జిల్లాలో రెండు రోజులు సిఎం బస
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇకపై ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు బస చేయనున్నారు. ఈనెల 15 నుంచి సిఎం పర్యటన ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులను సందర్శించి, ఆయా ప్రాజెక్ట్‌ల వద్ద సిఎం బస చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ‘చంద్రన్న బాట’లో మరికొన్ని రోడ్లు వాడవాడలో చంద్రన్నబాట పథకం కింద ఇప్పటికే రాష్ట్రంలో 3,261 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించారు. వచ్చే మూడేళ్ళలో 29,890 కిలో మీటర్ల రోడ్లను నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
బదిలీపై ఆచితూచి అడుగు
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీకి సంబంధించి ఆచితూచి అడుగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద ఎత్తున బదిలీలు చేయడం వలన డబ్బులు చేతులు మారుతున్నాయని, ఈ విధానానికి స్వస్తి చెప్పి, అవసరం మేరకు మాత్రమే ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై క్యాబినెట్‌లో చర్చ జరిగింది.

చిత్రం మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు