రాష్ట్రీయం

రెండు రాష్ట్రాల్లోనూ దత్తత గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో దత్తత గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలిపారు. శుక్రవారం ఖమ్మంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇక్కడ జీళ్ళచెర్వు గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, లాటరీ ద్వారా తాను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడటంతో అక్కడ కూడా మరో గ్రామాన్ని దత్తత తీసుకుంటానని వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోనూ గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నది తానేనని చెప్పారు. కాగా ప్రస్తుతం ఆయా పార్టీల నుంచి ఇతర పార్టీలకు వలసలు పోతున్న నాయకులంతా చివరకు కాంగ్రెస్ గూటికే చేరతారన్నారు. ఇది అనేక సార్లు రుజువైందని, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, అప్పుడు సోనియాగాంధీ త్యాగాలను గమనించిన నేతలు కాంగ్రెస్ వైపే చూస్తారని జోస్యం చెప్పారు. ఇదిలా ఉండగా అధిక దిగుబడినిచ్చే వరి విత్తనాలతో పాటు చేపల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మల్కా ద్వారా తయారయ్యే బట్టలకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యం ఉన్నదని, దానిని ఇక్కడ కూడా ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.