రాష్ట్రీయం

భారతీయ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ నాచారం, ఏప్రిల్ 1: హిందూత్వమనేది ప్రకృతి విధ్వంసానికి అనుకూలమైనది కాదని, అది ప్రకృతి విధ్వంసాన్ని ఎప్పటికీ ఒప్పుకోదని బిజెపి మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎన్ గోవిందాచార్య అన్నారు. అవేర్‌నెస్, యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోని దూర విద్యాకేంద్రంలో జాతీయవాదం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతీయ సంస్కృతికి తప్ప ప్రపంచంలో ఏ సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర లేదని ఆయన అన్నారు. మిగతా సంస్కృతులు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయన్నారు. ఈ దేశ సంపదను దోచుకోవడానికి మాత్రమే బ్రిటీషువారు రైల్వే లైన్లను ఏర్పాటు చేశారు తప్ప దేశాభివృద్ధికి కాదన్నారు. జాతీయత అనేది జమ్మూకాశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల నుంచి ప్రవహించే గంగానది లాంటి సువిశాలమైన హిందూరాజ్యమని పేర్కొన్నారు. దేవుళ్లు ఎంత మంది ఉన్నా మనస్సులో ఉండేది ఆత్మ ఒక్కటేనని వివరించారు. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే లక్ష్యమని, అదే భారతీయ సంస్కృతి నినాదమన్నారు. కార్మికులు, రైతులు, పశు సంపద వంటి మూడు అంశాలలో కార్మికులను పరిశ్రమల నుంచి, పశువులను రైతుల నుంచి వేరు చేయవద్దని హితవు పలికారు. నా మెడమీద కత్తిపెట్టినా ఈ పదాన్ని ఉచ్చరించను అనే వారిని క్షమించి వదలిపెట్టడమే హిందూత్వ గొప్పతనమని అభివర్ణించారు. హన్మంతప్పను అఫ్జల్ గురుతో పోల్చేవారు దేశభక్తులు కారని, హన్మంతప్ప దేశం కోసం ప్రాణాలర్పిస్తే, అఫ్జల్ గురు దేశ విచ్ఛిన్నానికి పని చేశాడని పేర్కొన్నారు. విద్యావ్యవస్థ విద్యావేత్తల చేతిలో, శాంతిభద్రతలు పోలీసుల చేతిలో, న్యాయ వ్యవస్థ న్యాయకోవిదుల చేతిలో ఉన్నప్పుడే దేశం ప్రగతి సాధిస్తుందన్నారు. రాజ్యాంగ సవరణ ఇప్పుడిప్పుడు జరిగేది కాదని, దానికి కొంత సమయం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రంగానంద భారతీస్వామి మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ, కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.

చిత్రం ఓయులోని దూర విద్యాకేంద్రంలో జాతీయవాదం అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన సదస్సులో ప్రసంగిస్తున్న బిజెపి మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎన్ గోవిందాచార్య.