రాష్ట్రీయం

రోహిత్ విగ్రహం తొలగింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్ధి ఉద్యమాలను నియంత్రించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సిఐఎస్‌ఎఫ్)ను నియమించాలని వర్శిటీ పాలకులు నిర్ణయించారు. సిఐఎస్‌ఎఫ్‌ను నియమించే వరకూ ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని పటిష్ఠం చేయాలని, అవసరమైతే మహిళా పోలీసులను సైతం నియమించాలని ఇటీవల జరిగిన డీన్‌లు, డైరెక్టర్ల సమావేశం నిర్ణయించింది. సమావేశం నిర్ణయాలు శుక్రవారం నాడు వెలుగుచూశాయి. క్యాంపస్ అంతా సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయడం, విద్యార్ధులకు స్వైపింగ్ కార్డులు జారీ చేయడం చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. క్యాంపస్‌లోకి మీడియా రావడం వల్ల రచ్చ ఎక్కువ అవుతోందని, పాజిటివ్ వార్తలకు కాకుండా నెగిటివ్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఇసి అభిప్రాయపడింది. దీంతో మీడియాను ఎట్టి పరిస్థితిలో ఏ రూపంలోనూ క్యాంపస్ లోపలికి రానివ్వరాదని నిర్ణయించింది. మార్చి 22, 23 తేదీల్లో మీడియాను క్యాంపస్‌లోకి రానివ్వకుండా అడ్డుకోవడం సత్ఫలితాలనే ఇచ్చిందని సమావేశం అభిప్రాయపడింది. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన రోహిత్ విగ్రహాన్ని తొలగించాలని కూడా నిర్ణయించింది. రోహిత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు దానిని తొలగించాలని నోటీసు ఇవ్వాలని, అది ఫలించకపోతే పోలీసుల సహకారంతో విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించింది. రానున్న రోజుల్లో ఒక అంబుడ్స్‌మన్‌ను, ఒక అధికారిని కూడా నియమించాలని నిర్ణయించారు.