రాష్ట్రీయం

ఐటిఐఆర్ హుళక్కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యక్షంగా 15లక్షల మందికి ఉపాధి... పరోక్షంగా 53 లక్షల మందికి బతుకుదెరువు... రాష్ట్రానికి పన్నుల రూపంలో 30వేల కోట్ల ఆదాయం... తెలంగాణలో నెలకొల్పుతామన్న ఐటిఐఆర్‌పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పించిన హామీలివి. ఇవన్నీ గాలికి కొట్టుకుపోయనట్టే కనిపిస్తోంది. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం దీన్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు.

----
హైదరాబాద్, ఏప్రిల్ 1: మూడేళ్ల క్రితం కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌కు ఐటిఐఆర్‌ను మంజూరు చేశారు. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో చేసిన ఈ ప్రకటనపై రాష్టవ్య్రాప్తంగా ఆసక్తి కలిగించింది. ఐటిఐఆర్ కోసం మూడువేల కోట్లు మంజూరు చేయాలని రాష్ట్రం కోరితే, కేంద్రం ఇప్పటి వరకు కేవలం 160 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పట్ల కేంద్రం ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సైతం దాదాపు ఆశలు వదులుకుంది. తెలంగాణ ఉద్యమకాలంలో ఐటిఐఆర్‌ను ప్రకటించడంతో కేంద్రానికి తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే ఈ ప్రాజెక్టు ఇచ్చారని సీమాంధ్ర నేతలు చెబితే, ఉద్యమానికి దీనికి సంబంధం లేదని, అంతకుముందు తీసుకున్న నిర్ణయమని కేంద్రంలోని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఐటిఐఆర్‌తో హైదరాబాద్ స్వరూపమే మారిపోతుందని ఆశలు రేకెత్తించారు. ఎన్నికల్లో యూపీఏ ఓడిపోయి, బిజెపి సొంతబలంతో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టు గురించి బిజెపి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ప్రాజెక్టును రద్దు చేసినట్టు చెప్పడం లేదు. నిధులు కేటాయిస్తామని కూడా అనడం లేదు. ఐటి మంత్రి, అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఆరుసార్లు కేంద్రాన్ని కలిశారు. దాదాపు మూడేళ్లుగా కేంద్రం నుంచి ఈ పథకానికి 160 కోట్లు మాత్రమే ఇంతవరకూ మంజూరయ్యాయి. ఐటిఐఆర్ ప్రాజెక్టు నుంచి వెనక్కి తప్పుకుంటున్నామని కేంద్రం ప్రకటిస్తే, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచనలో ఉంది. అయితే కేంద్రం దీనిపైనా స్పష్టత ఇవ్వడం లేదు. యూపీఏ హయాంలో కేంద్రం హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్ (ఐటిఐఆర్)కు ఆమోదం తెలిపింది. దీనికోసం సమగ్ర నివేదిక కూడా రూపొందించారు. ఐటిఐఆర్ వల్ల 310.840 కోట్ల రూపాయల ప్రత్యక్ష ఆదాయం, 219,440 కోట్ల రూపాయల పెట్టుబడులు, 235,000 కోట్ల రూపాయల ఐటి ఎగుమతులు, 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, 53 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. దీంతోపాటు ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ కోసం కేంద్రం విధాన నిర్ణయం మేరకు మహేశ్వరంలో 310 ఎకరాలు, 602 ఎకరాలతోరెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు ప్రతిపాదించారు. ఇవి ప్రత్యక్షంగా 40 వేల మందికి, పరోక్షంగా 2.10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాయి.
హైదరాబాద్‌కు ఐటిఐఆర్ ప్రాజెక్టు ప్రకటించిన తరువాత అప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్న పురంధ్రీశ్వరి ప్రయత్నంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నానికి మరో ఐటిఐఆర్‌ను ప్రకటించారు. అయితే హైదరాబాద్, విశాఖ ఐటిఐఆర్ ప్రాజెక్టుల పట్ల బిజెపి ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. కేంద్రంలో యూపీఏ ఓడిపోయి బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఐటిఐఆర్ ప్రాజెక్టుపై పలుసార్లు ఐటి శాఖ అధికారులు కేంద్రాన్ని కలిసినా, సిఎం, ఐటి మంత్రి సైతం కలిసినా దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఐటిఐఆర్ ప్రాజెక్టు పట్ల కేంద్రం సానుకూలంగా లేదని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సొంతంగానే ఐటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. గతంలో ఐటి రంగం హైటెక్ సిటీ ప్రాంతానికే పరిమితం కాగా, తెలంగాణ ప్రభుత్వం నగరానికి నాలుగువైపులా విస్తరించేందుకు కృషి చేస్తోంది. వరంగల్ హైవేపైన పోచారం వద్ద భారీ ఇన్ఫోసిస్ క్యాంపస్ నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు రెండవ శ్రేణి నగరాల్లో సైతం ఐటి కంపెనీల విస్తరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఐటిఐఆర్‌ను కేంద్రం అటకెక్కించినా తెలంగాణలో ఐటి రంగం విస్తరణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఐటిఐఆర్‌తో సంబంధం లేకుండానే ఐటి విస్తరణ కోసం నూతన ఐటి పాలసీని ప్రభుత్వం రూపొందించింది. ఈనెల నాలుగున భారీఎత్తున నూతన ఐటి పాలసీని ప్రకటించనున్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తితో పాటు పలువురు ఐటి ప్రముఖులు హాజరవుతారు.

చిత్రం సైబరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు కలిపి
ఐటిఐఆర్ కోసం నిర్దేశించిన క్లస్టర్ -1 మ్యాప్.