రాష్ట్రీయం

ప్రగతే మన మిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 9 గంటల విద్యుత్ సరఫరా, వైద్యారోగ్యం తదితర పథకాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ సత్వర ప్రగతి సాధన దిశగా ముందుకెళ్తుండడం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని సైతం ఆకర్షించిందని, ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారని సిఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉంటాయని, తెలంగాణ వాటిని అధిగమించడం అభినందనీయమని ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు సైతం ప్రభుత్వ పనితీరు పట్ల ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా శుక్రవారం జడ్పీ మీటింగ్ హాల్‌లో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కెసిఆర్ దాదాపు మూడు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ 15శాతం వృద్ధి రేటుతో దేశంలోని అగ్ర రాష్ట్రాల సరసన నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని, బంగారు తెలంగాణ స్వప్నం సాకారం చేసుకునేందుకు అడుగులు ముందుకు వేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని వనరులు, ఖర్చులు, ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పథకాలను నిశితంగా పరిశీలన జరిపి వాస్తవలను ప్రతిబింబించేలా 2016-17 బడ్జెట్‌ను రూపొందించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 871 పథకాల్లో మనకు నిరుపయోగంగా నిలిచే 450 పథకాలను తొలగించామన్నారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో సమృద్ధిగా భూములు ఉన్నాయని, సాగు జలాల కొరతతో అల్లాడుతున్న రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 2017 డిసెంబర్ నాటికి పూర్తిచేసి రాష్ట్రంలో ఇంటింటికి కుళాయిల ద్వారా శుద్ధి జలాలు అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి కుళాయిలను ఏర్పాటు చేయాలంటే పెద్ద సంఖ్యలో ప్లంబర్లు (్ఫట్టర్లు) అవసరం అవుతారని, సంబంధిత టెక్నీషియన్లతో పాటు ఐటిఐ చేసిన వారిని కూడా పనుల కోసం గుర్తించాలన్నారు. కాగా, బంగారు తెలంగాణ స్వప్నం సాకారానికి దోహదపడే మిషన్ కాకతీయ పనుల పట్ల ఎంతమాత్రం అలసత్వం ప్రదర్శించరాదని సిఎం కెసిఆర్ హితవు పలికారు. కరవు నివారణ పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రులను మరింతగా మెరుగుపర్చేందుకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామని, వీటిని వెచ్చిస్తూ సత్వరమే కొత్త సామాగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. నిజామాబాద్‌తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్తగా అన్ని అధునాతన సదుపాయాలతో కూడిన ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. సేద్యానికి తొమ్మిది గంటల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చిన దరిమిలా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పంటలకు విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మంత్రి పోచారంతో పాటు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, ఎంపిలు కల్వకుంట్ల కవిత, బిబి.పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, మున్సిపల్ చైర్మెన్లు, డిసిసిబి, ఐడిసిఎంఎస్ చైర్మెన్లు, అన్ని శాఖల అధికారులతో పాటు సిఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా తదితరులు పాల్గొన్నారు.

చిత్రం జిల్లా ప్రగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరుపుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్