రాష్ట్రీయం

లోటు భర్తీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిర్ణయించారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పివి రమేష్, ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత 16,300 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఏర్పడింది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకూ 2,800 కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇచ్చింది. మరో 500 కోట్ల రూపాయలను వారం రోజుల్లో ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మొత్తం ఏమేరకు సరిపోదని సమావేశంలో చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో రాష్ట్ర ఆర్థిక లోటులో కొంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తొలి ఏడాది భరిస్తుందని, ఆ తరువాత ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు విడులవుతాయని పేర్కొన్నారు. అయితే ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా నిధులు రాకపోవడం పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన 13వేల కోట్ల రూపాయలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి జైట్లీకి శనివారం లేఖ రాయాలని నిర్ణయించారు. గత ఏడాది ప్రణాళికా నిధులను అనుకున్న విధంగా ఖర్చు చేశామని మంత్రి యనమల ముఖ్యమంత్రికి వివరించారు. కొన్ని నిధులు ఖర్చు చేయడానికి ఆర్థిక, రెవెన్యూ శాఖల అనుమతి అవసరం అవుతుందని, ఈ రెండు శాఖల మధ్య సమన్వయం ఉండాలని ఆయన సూచించారు. రెండంకెల వృద్ధి రేటును సాధించడానికి గత ఏడాది మెరుగైన చర్యలు తీసుకున్నామని, ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధి రేటు సాధించడానికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరారు. రెండంకెల వృద్ధి సాధించని శాఖలపై దృష్టి సారించాలని యనమల సూచించారు. ముఖ్యంగా వ్యవసాయశాఖ పనితీరు మెరుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అన్ని శాఖలూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆయన సూచించారు. రెవెన్యూశాఖలో లోపాలను సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదాయాన్ని సమకూర్చే శాఖలు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయని, ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.