రాష్ట్రీయం

జూలైనుంచి తల్లీబిడ్డ ఆస్పత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సంక్షేమం, అవకాశాలు, భద్రత తదితర అంశాలపై ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన సీనియర్ అధికారులతో మహిళా సంక్షేమంపై చర్చించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళాభ్యున్నతికి, ఆరోగ్యానికి, ఆర్థిక స్వావలంబనకు, వారిలో విశ్వాసాన్ని కల్పించేందుకు కొత్త పథకాలను, నిర్ణయాలను ప్రకటించామన్నారు. వాటన్నింటినీ అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో షీ బృందాలను ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని హోం శాఖ అధికారులను సిఎం ఆదేశించారు.
సింగిల్ విండో పథకం ద్వారా 35 సంవత్సరాలు నిండిన మహిళలకు ఉచిత సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇంతవరకూ ఆరోగ్య సేవలు, కార్యక్రమాల పరిధిలోకి రాని మహిళలు అందర్నీ చేర్చుకునేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని 223 ఆరోగ్య కేంద్రాల ద్వారా గర్భిణులకు ఉచితంగా టెలిఆల్ట్రా, సోనోగ్రఫీ సేవలు అందించాలని అన్నారు. జూలై 1న పది వంద పడకల సౌకర్యం ఉన్న తల్లీబిడ్డ ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఒత్తిడి , వేధింపులకు గురైన మహిళలకు తక్షణ సాయం అందించడానికి 181 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి వస్తుందని అన్నారు.
ఉద్యోగం చేసే మహిళలు, బాలికల కోసం ఉన్న అన్ని గృహాలను, హాస్టళ్లను తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసేలా చట్టం తీసుకువస్తామని అన్నారు. మహిళా భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో కన్యా శక్తి టీమ్‌లను ఏర్పాటు చేసి, ఆడపిల్లలు అందరూ శిక్షణ పొందేలా చేస్తామని అన్నారు. అభయం పేరిట యాప్ తెస్తామని, తద్వారా భద్రతపై మహిళలకు నమ్మకం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఐజిని, జిల్లాల్లో ఒక డిఎస్పీని నియమించి ప్రత్యేక బృందాలను నియమిస్తామని సిఎం చెప్పారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. ఆస్పత్రుల్లో 200 మంది గైనకాలజిస్టులను నియమిస్తామన్నారు.