రాష్ట్రీయం

తెలంగాణకే సోమేశ్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో 15మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను కేటాయించిన తీరును తప్పుబడుతూ ఈ కేటాయింపులను రద్దు చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును క్యాట్ బెంచి బి వెంకటేశ్వరరావు, రంజన చౌదరి వెలువరించారు. జిహెచ్‌ఎంసి మాజీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడాన్ని తప్పుబడుతూ ఆయనను తెలంగాణకు కేటాయించాలని ఆదేశించింది. సి హరికిరణ్, శివ శంకర్ లహోటి, శ్రీజన గుమ్మెళ్లను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన వారిగా గుర్తించాలని క్యాట్ పేర్కొంది. ఐఎఎస్ అధికారులు అనంతరాము, ఎస్‌ఎస్ రావత్, ఆమ్రపాలి కాటా, కరుణ వాకాటి, ఏ వాణి ప్రసాద్, మల్లెల ప్రశాంతిని తెలంగాణకు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అలాగే ఐపిఎస్ అధికారులు సంతోష్ మెహ్రా, అభిలాష బిస్టా, అంజని కుమార్‌లను తెంలగాణకు కేటాయించడాన్ని, ఎవి రంగనాథ్‌ను ఏపికి కేటాయించడాన్ని కొట్టివేసింది.