రాష్ట్రీయం

251 మంది ఖైదీల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్టవ్య్రాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టవ్య్రాప్తంగా 251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం జివో 38 జారీ చేసింది. వీరంతా రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి విడుదలయ్యారు. 251 మంది ఖైదీల్లో 190 మంది జీవిత ఖైదీలు కాగా మిగిలిన వారంతా ఇతర ఖైదీలు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలందరినీ జనవరి 26న విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది. చర్లపల్లి జైలులో 49 మంది ఖైదీలు విడుదల కాగా వీరిలో 29 మంది జీవిత ఖైదీలు ఉన్నారు. చంచల్‌గూడ జైలులో 29 మంది మహిళలతోపాటు 11మంది సాధారణ ఖైదీలున్నారు. అదేవిధంగా ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ జిల్లా కేంద్రాల నుంచి కూడా ఖైదీలు విడుదలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొదటిసారిగా వరంగల్ రేంజ్ పరిధిలో 110 మంది ఖైదీలకు విముక్తి కలిగింది. వరంగల్ రేంజ్ పరిధిలోని నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 110 మంది సత్ప్రవర్తన ఖైదీలకు గానూ 108 మంది ఖైదీలను విడుదల చేశామని వరంగల్ రేంజ్ జైళ్ల డిఐజి కేశవనాయుడు తెలిపారు.సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలతో వారి కుటుంబాల్లో సంతోషం వ్యక్తమయింది. ఇదిలావుండగా నగరంలో ఏసిపి సత్తయ్య హత్య కేసులో నిందితుడు కూడా విడుదల కావడంతో ఖైదీల్లో మంచి ప్రవర్తన వస్తుందని జైలు అధికారులు తెలిపారు.