రాష్ట్రీయం

డబుల్ ధమాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: ఎమ్మెల్యేలకు ఏటా ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ఏటా కోటిన్నర రూపాయలు విడుదల చేస్తుంటే, ఇకనుంచి మూడు కోట్లు నిర్ణయించింది. 120మంది ఎమ్మెల్యేలు, 40మంది ఎమ్మెల్సీలు మొత్తం 160 మందికి నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ఏటా 480 కోట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని శాసనసభలో మంగళవారం సిఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తొలుత ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నిధులు సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలని, నిధిలో సగం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వ్యయం చేసేలావున్న నిబంధన తొలగించి, ఎంపీ లాడ్స్ నిబంధనలను అమలు చేయాలని ప్రతిపాదించారు. జానారెడ్డి ప్రతిపాదనను సమర్థిస్తూ బిజెపి శాసన సభాపక్షం నాయకుడు లక్ష్మణ్, ఎంఐఎం శాసన సభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్‌లు ఈ నిధులను ఐదు కోట్లకు పెంచాలని కోరారు. సిపిఐ సభ్యులు రవీందర్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు వెంకటేశ్వర్లు, తెదేపా సభ్యులు సండ్ర వెంకటవీరయ్య అందరూ ఐదు కోట్లకు డిమాండ్ చేశారు. దీనిపై సిఎం కెసిఆర్ స్పందించారు. జానారెడ్డి కోరిన తరువాత ఆర్థిక శాఖ అధికారులను సంప్రదించినట్టు చెప్పారు. ఒకేసారి ఐదు కోట్లు పెంచే బదులు దశలవారీగా పెంచాలని నిర్ణయించామని, ప్రస్తుతానికి రెండు కోట్లకు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. సభ్యులంతా ఐదు కోట్లకు పెంచాలని అడగడంతో అక్కడి నుంచే సిఎం ఆర్థిక శాఖ అధికారులకు మూడువేళ్లు చూపిస్తూ సరేనా? అని అడిగారు. అనంతరం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి సర్దుబాటు చేసేలా మొత్తం మూడు కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో సగం ఇన్‌చార్జి మంత్రి అధీనంలో ఉండే నిబంధన తొలగిస్తున్నట్టు ప్రకటించారు. శాసనసభ్యులు, సభ గౌరవాన్ని పెంచేలా ఆంక్షలను తొలగిస్తున్నామని, దీనికి సంబంధించి వెంటనే నిర్ణయం తీసుకోనున్నట్టు కెసిఆర్ చెప్పారు. ఎమ్మెల్యేల జీత భత్యాలు పెంచుతూ మంగళవారం నాడే నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఇదే రోజు నియోజకవర్గ అభివృద్ధి నిధులను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.