రాష్ట్రీయం

సైబరాబాద్ కమిషనరేట్‌ను సందర్శించిన విదేశీ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 1: సైబరాబాద్‌లో శాంతి భద్రతలు, మహిళా భద్రతను తెలుసుకునేందుకు మంగళవారం విదేశీ పార్లమెంట్ ప్రతినిధి బృదం సైబరాబాద్ కమిషనరేట్‌ను సందర్శించింది. 24దేశాలకు చెందిన 46మంది పార్లమెంట్ సభ్యులు సైబరాబాద్ పరిధిలోని ఇన్ఫర్మేషన్ టెక్మాలజీ కారిడార్‌ను పరిశీలించారు. అనంతరం సైబరాబాద్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న సైబర్ నేరాలు, నేరాల అదుపు, మహిళల భద్రతపై తీసుకుంటున్న చర్యలను కమిషనర్ సివి ఆనంద్ వివరించారు.
శాంతి భద్రతలు, ఐటి కారిడార్‌లో మహిళల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భద్రతా చర్యల పట్ల విదేశీ ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ సైబరాబాద్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని, ఐటి కారిడార్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, సిసి కెమెరాలు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు.
ఈ మేరకు విదేశీ బృందం స్పందిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు సైబరాబాద్ అనువైన ప్రాంతమని, ఇక్కడి ప్రభుత్వం తగిన సౌకర్యాలు కూడా కల్పిస్తుందని సంతృప్తిని వ్యక్తపరిచారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీతో పోలీసులు కలసి పనిచేస్తున్న పనులను అధికారులు భరణి, అమర్‌నాథ్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి కార్తీకేయ, ఎస్‌సిఎస్‌సి సభ్యులు పాల్గొన్నారు.

ఆ ఎంపి, ఎమ్మెల్యేపై
చర్య తీసుకోండి: హైకోర్టు

హైదరాబాద్, డిసెంబర్ 1: తిరుపతి విమానాశ్రయంలో ఓ అధికారి ఫిర్యాదు మేరకు ఎంపి పివి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలపై ఏరుపుడు పోలీసు స్టేషన్‌లో గత నవంబర్ 26న కేసు నమోదైంది. కాగా పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున అతనిని అరెస్టు చేయలేదు. అయితే వారి అరెస్టును సెక్షన్ 47ను పరిగణలోకి తీసుకోవాలంటూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు జస్టిస్ పివి సంజయ్ కుమార్ ఎరపేడు పోలీసు హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించారు.

కరువుపై క్యాబినెట్ సబ్ కమిటీ
ఢిల్లీ వెళ్లిన మంత్రులు

హైదరాబాద్, డిసెంబర్ 1: కరువు సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నాయకత్వంలోని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కె తారక రామారావు, తన్నీరు హరీశ్‌రావుసభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే మంత్రుల బృందం రాష్ట్రంలోని కరువు పరిస్థితి కేంద్రానికి వివరించి సహాయం కోరేందుకు ఢిల్లీ వెళ్లింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కరవు పరిస్థితిపై కేంద్రానికి వివరించి సహాయం కోరతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి తెలంగాణలో కరువు పరిస్థితిని వివరిస్తారు.