రాష్ట్రీయం

హెల్మెట్టేది బాబూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 1: హెల్మెట్.. హెల్మెట్.. హెల్మెట్ అంటూ ఊదరగొట్టి వాహనచోదకులకు నిద్రలేకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పోలీసు అధికారులు.. రవాణాధికారులు, యంత్రాంగం సాక్షాత్తు సిఎం చంద్రబాబు హెల్మెట్ లేకుండా బుల్లెట్‌ను నడపగా నాయకులు, కార్యకర్తల కేరింతలు, మంత్రుల మెచ్చుకోలు, అధికార సిబ్బంది సెల్యూట్‌లతో ఆ ప్రాంతం యావత్తు రణగొణధ్వనులు మిన్నంటాయి. గత రెండు నెలలుగా హెల్మెట్లు తప్పక ధరించాలని సర్కారు ఆదేశిస్తుండగా, పోలీసు అధికార సిబ్బంది తప్పనిసరి అంటూ సవాలక్ష నిబంధనలతో ప్రజల నెత్తిపై జరిమానా భారం వేస్తున్నారు. దాంతో వాహన చోదకులు వేల రూపాయలు వెచ్చించి హెల్మెట్ సమకూర్చుకున్నారు. అయితే చంద్రబాబు గుంటూరు జిల్లా వేమూరులో బుల్లెట్‌పై హెల్మెట్ లేకుండానే పర్యటించారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా మంగళవారం వేమూరు వచ్చిన ఆయన కార్యకర్తల ప్రోత్సాహంతో ఎపి 7ఎఎల్ 3492 నెంబరు గల బుల్లెట్‌ను నడిపారు.

చిత్రం.. హెల్మెట్ లేకుండా బుల్లెట్ నడువుతున్న సిఎం చంద్రబాబు