రాష్ట్రీయం

నెయ్యిలో నాణ్యత లేకపోతే తిరస్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, నవంబర్ 29: శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యత లేకపోతేనే తిరస్కరిస్తుంటామని టిటిడి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శర్మిష్ట అన్నారు. కర్ణాటక కేంద్రంగా దేశవ్యాప్తంగా నెయ్యి సరఫరా చేస్తున్న నందిని నెయ్యి ఉత్పత్తుల్లో కల్తీ జరుగుతున్న విషయం ఇటీవల వెలుగుచూసిన విషయం పాఠకులకు విదితమే. నందిని సంస్థ సరఫరా చేసే నెయ్యిని టిటిడి కూడా కొనుగోలు చేసి స్వామివారి ప్రసాదాలకు వినియోగిస్తోంది. ఈక్రమంలో కల్తీ నెయ్యిని టిటిడి శ్రీవారి ప్రసాదాలకు వినియోగిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాలపై టిటిడి యాజమాన్యం స్పందించింది. ఇందులో భాగంగా టిటిడి ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ శర్మిష్ట, ఆలయ డిప్యూటీ ఇఒ చిన్నంగారి రమణ ఆదివారం వివరణ ఇచ్చారు. డాక్టర్ శర్మిష్ట మాట్లాడుతూ టిటిడి నిబంధనల ప్రకారం ఏమాత్రం నాణ్యత కొరవడినా నెయ్యి సరఫరా చేసే ఏ సంస్థనైనా టిటిడి తిరస్కరిస్తుందన్నారు. అలాంటప్పుడు కల్తీ నెయ్యిని శ్రీవారి ప్రసాదాలకు వినియోగిస్తామని ప్రచారం చేయడం సబబు కాదన్నారు. శ్రీవారి ప్రసాదాలే కాకుండా ఏ నిత్యావసర వస్తువు కొనుగోలు చేయలన్నా వాటిని క్షుణ్ణంగా పరిశీలించే ల్యాబ్ వ్యవస్థ టిటిడిలో ఉందన్నారు. నెయ్యి నాణ్యతను పరిశీలించడం మూడు దశల్లో సాగుతుందన్నారు. నెయ్యిలో ఇతర నూనె వస్తువులు ఏమైనా కల్తీ అవుతున్నాయా, కల్తీ వ్యర్థపదార్థాలు ఏమైనా నెయ్యిలో కలసి ఉన్నాయా, జంతువుల చర్మం నుంచి తీసే నూనేమైనా కలిపారా అనే అంశాలను టిటిడి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఇందులో ఏ చిన్న మార్పు ఉన్నా వెంటనే ఆ నెయ్యిని తిరస్కరించి ఆ సంస్థకే పంపడం జరుగుతుందన్నారు.
శ్రీవారి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల అవసరాలకు ప్రతిరోజు 12 నుంచి 14 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నామన్నారు. శ్రీవారి ఆలయానికి ట్యాంకర్ల ద్వారా నెయ్యిని తెచ్చుకుంటామని, అనుబంధ ఆలయాలకు టిన్నుల ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తామన్నారు. ఇందుకోసం కోయంబత్తూరు కేంద్రంగా ఉన్న తిరుమల డెయిరీ, మహారాష్ట్ర కేంద్రంగా ఉన్న శుభిఆర్ గోవింద సంస్థ అనే రెండు సంస్థలు నెయ్యి సరఫరాపై టిటిడి యాజమాన్యంతో ఒప్పందం కుదర్చుకున్నాయన్నారు. నెయ్యి తమకు అందినప్పుడు ప్రతి ట్యాంకర్‌ను, ప్రతి టిన్నును ర్యాండంగా పరీక్షిస్తామన్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే నెయ్యి తిరుమలకు చేరుకుంటుందన్నారు. ఈక్రమంలో ఎక్కడా పొరపాట్లు జరిగే అవకాశం లేదన్నారు. భక్తుల మనోభావాలతో కూడుకున్న అంశాలపై మీడియా కూడా తొందరపాటు విధానాలతో ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. డిప్యూటి ఇఒ చిన్నంగారి రమణ మాట్లాడుతూ నందిని సంస్థ సరఫరా చేసే నెయ్యిని గత రెండు సంవత్సరాల క్రితం టిటిడి నిబంధనలకు అనుకూలంగా నాణ్యతగా ఉన్నప్పుడు వినియోగించామన్నారు. ఆ తరువాత ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోళ్లను ఆపేశామన్నారు. నాణ్యత లోపించిన మరుక్షణం వారితో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తలను తాను ఖండిస్తున్నానని అన్నారు.

టిటిడికి రెండు
అంబులెన్స్‌లు విరాళం

తిరుమల, నవంబర్ 29: తిరుమలలో శ్రీవారి భక్తులకు అత్యవసర సమయాల్లో సేవలందించడానికి కలకత్తాకు చెందిన ప్రకాష్ చౌదరి అనే భక్తుడు ఆదివారం టిటిడికి రెండు అంబులెన్స్‌లను విరాళంగా అందించారు. వీటిని తిరుమల జెఇఒ శ్రీనివాసరాజు టిటిడి తరపున శ్రీవారి ఆలయం వద్ద స్వీకరించారు. ఈసందర్భంగా తిరుమల జెఇఒ మాట్లాడుతూ దాత ఈ వాహనాలను శ్రీవారి అదనపు పోటు విభాగంలో గత రెండు దశాబ్దాలకు పైగా విశేష సేవలు అందించి ఇటీవలే గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన రమేష్ జ్ఞాపకార్ధం అందించినట్లు తెలిపారు. ఒక్కొక్క వాహనం విలువ సుమారు రూ.15 లక్షలని తెలిపారు. అనంతరం ఆయన వాహనాల తాళాలను టిటిడి రవాణా శాఖ జిఎం శేషారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ చిన్నంగారి రమణ, డిఐ భాస్కర్‌నాయుడు, పోటు రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
టిటిడికి విరాళంగా అందజేస్తున్న అంబులెన్స్‌లు