రాష్ట్రీయం

స్మార్టు ఆంధ్రా సాధనకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సభ్యులుగా కుటుంబరావు, రవికుమార్, సిఎస్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 12: స్మార్టు ఆంధ్రప్రదేశ్ సాధనకు వీలుగా స్మార్టు విలేజ్, స్మార్టు వార్డుల రూపకల్పనకు రాష్ట్రప్రభుత్వం ఉన్నత స్థాయి అక్రిడిటేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ స్మార్టు వార్డులు, స్మార్టు విలేజ్‌ల రూపకల్పనలో విశేష కృషి చేసిన పంచాయితీలను, సంస్థలను, వార్డులను గుర్తిస్తుంది. ఈ కమిటీలో ఎపి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సి కుటుంబరావు, నాన్ రెసిడెంట్ తెలుగు ట్రస్టు సిఇఓ రవికుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి , మున్సిపల్ పాలనా పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, యునిసెఫ్ ప్రతినిధి దీపక్ కుమార్ దేవ్, ఎపిఎంఎఎస్ ప్రతినిధి సి ఎస్ రెడ్డి, ప్రణాళికా శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ శాంతి ప్రియా పాండే సభ్యులుగా ఉంటారు. జిల్లాల్లో మండల స్థాయి కమిటీలను కలెక్టర్లు నియమిస్తారు. ఆ కమిటీలు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. అక్కడి నుండి నివేదికలు రాష్టస్థ్రాయికి వస్తాయి. అనంతరం రాష్ట్ర కమిటీ పరిశీలించి అంచనాలు తయారుచేస్తారు.