రాష్ట్రీయం

విడదీయడం అంత తేలిక కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం
అవిభక్త కవలలు వీణావాణిలను పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు
వారం రోజుల్లో ఢిల్లీకి తీసుకెళ్తామని వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 17: అవిభక్త కవలలు వీణావాణిలను విడదీయటం అంత సులువేమీ కాదని అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) వైద్యులు వ్యాఖ్యానించారు. పుట్టినప్పటి నుంచి నిలోఫర్ ఆసుపత్రిలోనే ఉంటున్న వీణావాణిలను ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యుల బృందం గురువారం పరిశీలించింది. న్యూరో సర్జన్లు డాక్టర్ అశీశ్ సూరి, డాక్టర్ మన్మోహన్‌సింగ్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ మనీశ్ సింఘాల్‌లతో కూడిన బృందం ఈ కవలలను విడదీయటం అంత సులువేమీ కాదని అభిప్రాయపడింది. ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, వారు ఆరోగ్యంగానే ఉన్నారని, ఇద్దరు చిన్నారులు కూడా ఎంతో తెలివైన వారని, ఇందుకు వారు ఆసుపత్రిలోనే విద్యాభ్యాసం కొనసాగించటం ఒక ఉదాహరణగా వివరించారు. వీరిద్దరిని విడదీసేందుకు నిర్వహించాల్సిన శస్తచ్రికిత్స విషయంలో ఎన్నో అధ్యయనాలు జరగాలని, ఇప్పట్లో ఏం చెప్పలేమని వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయటంతో వారి ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు తాము వచ్చామని బృందంలో ఒకరయిన డాక్టర్ సింగ్ తెలిపారు. సాధారణంగా అవిభక్త కవలల విషయంలో శరీరంలోని పలు భాగాలు అంటుకుని జన్మిస్తారని, కానీ వీణావాణిలు మాత్రం తలలు అంటుకోవటంతో పాటు మెదడు కూడా కలిసి ఉన్నందున, వారిని విడదీయటం ఎంతవరకు సాధ్యం, ఆపరేషన్ నిర్వహిస్తే సక్సెస్ రేటు ఎంత వరకుంటుందన్న విషయంపై ఇంకా చాలా అధ్యయనాలు, చర్చలు జరగాల్సి ఉంటుందని వైద్యులు అభిప్రాయపడ్డారు. మరో వారం, పది రోజుల్లో ఈ చిన్నారులను ఢిల్లీకి తీసుకెళ్లి మరిన్ని ఆధునిక వైద్య పరీక్షలు నిర్వహించి, వీరికి శస్తచ్రికిత్స నిర్వహించేందుకు సుముఖతను వ్యక్తం చేసిన లండన్ వైద్యులకు పంపిన తర్వాత శస్తచ్రికిత్సపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని డాక్టర్ సింగ్ వివరించారు. ఈ అవిభక్త కవలలకు సంబంధించి లండన్ వైద్యులు ఎంతో ఆసక్తికరమైన సందేహాలు వ్యక్తం చేశారని వివరించారు. మరింత అధునాతన సౌకర్యాలు ఎయిమ్స్‌లో ఉన్నందున, వీరిని అక్కడకు తీసుకెళ్లి మరిన్ని పరిశోధనలు నిర్వహిస్తామన్నారు. పరిశోధనలు, అధ్యయనాల నివేదికలను బేరీజు వేసుకుని, ఆ తర్వాత శస్తచ్రికిత్సపై ఎయిమ్స్ వైద్యుల బృందం, ప్రభుత్వం, చిన్నారుల తల్లిదండ్రులు సైతం సమష్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, వారిద్దరిని సురక్షితంగా విడదీసి, వారు సురక్షితంగా జీవించాలన్నది తమ ఆకాంక్ష అని, అందుకు ఎన్ని రోజులు పడుతుందన్న విషయం కాలమే నిర్ణయిస్తుందని డిఎంఇ రమణి తెలిపారు. కవలల గురించి నిలోఫర్ ఆసుపత్రి పెడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రమేశ్‌రెడ్డి బృందానికి వివరించారు. (చిత్రం) నిలోఫర్‌లో వీణా, వాణిల ఆపరేషన్ వివరాలను మీడియాకు తెలియజేస్తున్న డాక్టర్ల బృందం