రాష్ట్రీయం

తెరాసలోకి సాయన్న, ప్రభాకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఎం కెసిఆర్ సమక్షంలో గులాబీ కండువా
టిడిపి, కాంగ్రెస్‌లకు మరో షాక్

హైదరాబాద్, డిసెంబర్ 3:సికిందరాబాద్ కంటోనె్మంట్ టిడిపి ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీశ్‌రావు వెంట సాయన్న, ప్రభాకర్‌లు గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాన్ని చూసి టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేగా నియోజక వర్గం అభివృద్ధే తనకు ముఖ్యం, అభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు సాయన్న తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి టిఆర్‌ఎస్‌కే సాధ్యమని అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళిక బాగుందని, తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని, విద్యుత్ సమస్యలు లేని తెలంగాణ పాలనను ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు. పేదల కోసం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరినందుకు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. టిడిపిలో తనకేమీ ఇబ్బందులు లేవని, అభివృద్ధి కోసమే పార్టీ టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. టిడిపిని వీడుతున్నందుకు కొంత బాధగానే ఉందని, టిడిపిలో తనకు అన్ని విధాల ఆదరణ లభించిందని అన్నారు. టిడిపి సభ్యత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. ఈరోజు నుంచి తిరుపతికి సిఫారసు లేఖలు రాయనని అన్నారు.
కాంగ్రెస్‌లో ఎవరినెవరు పట్టించుకోవడం లేదు: ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ఎవరీ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి, గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ విజయం కోసం రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి సూచనలు చేసినా పట్టించుకోలేదని, ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కెసిఆర్ అద్భుతమైన ప్రణాళికలతో వెళుతున్నారని, విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తారని అన్నారు.