రాష్ట్రీయం

పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసు పరారీలోనే ట్రాన్స్‌కో డిఇ సత్యానందం

విజయవాడ , డిసెంబర్ 19: కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో నిందితులను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో అరెస్టయిన విజయవాడకు చెందిన యలమంచిలి రాము, దూడల రాజేష్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో నిందితుడైన విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీరు (టెక్నికల్) ఎం సత్యానందం తరపున హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలైనట్లు సమాచారం. ప్రస్తుతం సత్యానందం పరారీలో ఉన్నాడు. కాల్‌మనీ పేరుతో అప్పులు ఇచ్చి తీర్చాలంటూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై విజయవాడకు చెందిన ఫైనాన్సియర్ యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము, బౌన్సర్ భవానీశంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ ఎం సత్యానందం, వెనిగళ్ళ శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్‌లపై ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన ఈ సెక్స్‌రాకెట్ ఉదంతం ప్రస్తుతం అసెంబ్లీని పట్టి కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యలమంచిలి రాము, దూడల రాజేష్‌లను ఈ నెల 13న అరెస్టు చేసి రిమాండు నిమిత్తం జైలుకు పంపారు. కాగా నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున విచారణ కోసం పదిరోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఈ నెల 16న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌పై వాదనల అనంతరం ఆరురోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మూడు రోజుల పాటు పోలీసు విచారణ, మరో మూడు రోజులు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాలని, థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, న్యాయవాది సమక్షంలో విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. నిందితులపై నమోదైన కేసుల్లో అత్యాచారం కేసు కూడా ఉంది. దీంతో మాచవరం పోలీసులు జైలులో ఉన్న యలమంచిలి రాము, దూడల రాజేష్‌లను ఆదివారం తమ కస్టడీకి తీసుకోనున్నారు. నాలుగో నిందితుడైన సత్యానందం తరపున హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలైనట్లు సమాచారం. పదిరోజులుగా పరారీలో ఉన్న నిందితుడు పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లుభావిస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలైనట్లు వచ్చిన ప్రచారం పోలీసులను కలవరపెడుతోంది.