రాష్ట్రీయం

ప్రశాంతి నిలయంలో అలరించిన జాకీర్ హుస్సేన్ కచేరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 24: విశ్వవిఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తన కచేరీతో సాయి భక్తులను ఆనందసాగరంలో ఓలలాడించారు. పుట్టపర్తి సత్యసాయి 90వ జయంతి వేడుకల్లో భాగంగా బాబాను అమితంగా ప్రేమించే, ఆరాధించే జాకీర్ హుస్సేన్ మంగళవారం సాయంత్రం ప్రశాంతినిలయంలోని సాయికుల్వంత్ హాలులో కచేరి నిర్వహించారు. సాయిసన్నిధిలో అశేష భక్తజనవాహిని మధ్య జాకీర్ హుసేన్ తబలా కచేరిని విన్న భక్తులు మంత్రముగ్ధులై దివ్యానుభూతికి లోనయ్యారు. వాహ్ జాకీర్... వాహ్ అంటూ ప్రతి భక్తుని నోట అనిపించిన హుసేన్ కచేరీ జయంతి ఉత్సవాలకే హైలెట్ అని చెప్పవచ్చు. అనంతరం సత్యసాయి సమాధి వద్ద జాకీర్ హుస్సేన్ పుష్పగుచ్ఛాన్ని ఉంచి ప్రణమిల్లారు. ట్రస్టుసభ్యులు ఆర్.జె.రత్నాకర్, శ్రీనివాసన్, నాగానంద్, టికెకె.్భగవతి జాకీర్ హుసేన్‌ను ప్రత్యేకంగా సన్మానించి సువర్ణ రజత ఫలకాన్ని బహూకరించారు. ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్ జాకీర్ హుస్సేన్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

ఒమన్, భారత్ శిక్షణనౌకల స్నేహపూర్వక ప్రయాణం
విశాఖపట్నం, నవంబర్ 24: భారత నౌకాదళం, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్‌కు చెందిన రెండు భారీ నౌకలు మస్కట్ నుంచి కోచి వరకూ కలిసి ప్రయాణం చేశాయి. సుమారు 60 సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. అనేక సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. గతంలో భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలు, దుస్తులు ఒమన్‌కు ఎగుమతి అయ్యేవి. అలాగే ఒమన్ నుంచి బంగారాన్ని భారత దేశం దిగుమతి చేసుకునేది. సంస్కృతి, సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకునేవారు. చాలా కాలం తరువాత మళ్లీ ఇరు దేశాల నౌకలు కలిసి ప్రయాణం చేశాయని తూర్పు నౌకాదళ అధికారులు తెలియచేశారు.

బిసిల కోసం..మళ్లీ ‘ఆదరణ’
శ్రీకాకుళం, నవంబర్ 24: పదేళ్ళుగా అలక్ష్యానికి గురైన వెనుకబడిన తరగతులను ఆదుకునేందుకు మళ్లీ నాటి ‘ఆదరణ’ పథకాన్ని, లేదా అంతకంటే దీటైన పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు యోచిస్తున్నారని కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. మంగళవారం శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన చంద్రన్న బిసి స్వయం ఉపాధి ఉత్సవాలను బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చేతివృత్తులు చేసుకునే వెనుకబడిన కుటుంబాలకు పనిముట్లు అందజేసి వారి జీవనోపాధికి తోడ్పడిన పథకాన్ని మళ్లీ అమలు చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధం అవుతోందన్నారు. ఇందుకుగాను ముఖ్యమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారని, అందులో బిసి మంత్రులుగా తాను, కొల్లు రవీంద్ర సభ్యులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. కమ్మరి, కుమ్మరి, చాకలి, కంసాలి, వడ్రంగి వంటి వెనుకబడిన కులాలవారు వారి వారి కులవృత్తులు చేసుకునేందుకు ఆసరా కల్పించేలా తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ ఆదరణ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. 2015-16 విద్యా సంవత్సరంలో బిసి విద్యార్ధులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం 1319 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. కేవలం 18 నెలల్లో ఇంత పెద్ద మొత్తాన్ని విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం వెచ్చించిందన్నారు. ఇబిసి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం 575 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. 897 ప్రీ-మెట్రిక్ హాస్టళ్లు, 349 పోస్టు-మెట్రిక్ హాస్టళ్లు, 32 రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా బిసిల విద్యాభ్యాసానికి ప్రభుత్వం తోడ్పడుతోందని బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నూతనంగా బిసి వసతి గృహాల భవనాలు, గురుకుల పాఠశాలల నిర్మాణానికి 75 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. బడ్జెట్‌లో 6640 కోట్ల రూపాయలతో బిసి సబ్‌ప్లాన్ అమలు చేశామన్నారు. బలహీన వర్గాల లబ్ధిదారులకు బిసి కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో 24 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని వెనుకబడిన వారికి మంత్రులు అచ్చెన్న, రవీంద్ర అందజేసారు.