రాష్ట్రీయం

13 నుంచి మావుళ్లమ్మ సంక్రాంతి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 9: రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన శక్తి ఆలయాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంక్రాంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 56వ ఉత్సవాలు 13వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీ వరకు అంటే 33 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ, అమ్మవారి దేవస్థానం సంయుక్తంగా ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. భారీ వ్యయంతో ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. 33 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతీ రోజు కోలాట బృందం భజనలు, బుర్రకథలు జరుగుతాయి. 33 రోజుల్లో 24 నాటకాలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతీరోజు భరత నాట్యాలు, హరికథలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన మ్యూజిక్ ఆర్కెస్ట్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో సినీ గాయకులు, గాయకురాలు పాల్గొని వారి గానంతో అలరింపచేస్తారు. అదే విధంగా సినీ ప్రముఖులను సన్మానించుకునే సాంప్రదాయం ఈ ఉత్సవాల్లో ఉంది. కొటికలపూడి గోవిందరావు కళావేదికపై ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సన్మానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సినీ నటి తులసికి ప్రముఖుల సమక్షంలో సువర్ణ కంఠాభరణంతో జనవరి 26వ తేదీన ఘన సన్మానం ఏర్పాటుచేశారు. ప్రముఖ సినీ నటుడు జెడి చక్రవర్తిని సువర్ణహస్తాకంకణంతో ఫిబ్రవరి 2వ తేదీన సన్మానించనున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన లక్ష మందికి అఖండ అన్నసమారాధన చేయనున్నారు. అమ్మవారి ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని భక్తులు కొలుస్తుంటారు.