రాష్ట్రీయం

సోమాలియా తీరంలో నౌకను రక్షించిన ఐఎన్‌ఎస్ సుమేథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: నడి సముద్రంలో మరమ్మతులకు గురై సహాయం కోసం ఎదురు చూస్తున్న సంప్రదాయ నౌక (్ధ) ఆల్ హమీద్‌ను భారత నౌకాదళానికి చెందిన గస్తీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ సుమేథ గుర్తించి సాయం అందించింది. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఈడెన్‌లో గస్తీ విధుల్లో ఉన్న సుమేథ సోమాలియా ప్రాంతంలో గస్తీలో ఉండగా సంప్రదాయ చెక్క నౌక ఆల్ హమీద్‌ను నడిసముద్రంలో కనుగొంది. పరిస్థితులు గమనించేందుకు సుమేథలోని హెలికాప్టర్ హుటాహుటిన బయలుదేరి ఆల్ హమీద్ మరమ్మతులకు గురై నిలిచిపోయినట్టు నిర్ధారించింది. తక్షణమే బోర్డింగ్ బృందంతో పాటు నౌకాదళ సాంకేతిక బృందం సాంకేతిక లోపాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. అయితే ఆల్ హమీద్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం సముద్రం మధ్యలో సరిదిద్దే అవకాశం లేదని గుర్తించిన నౌకాదళ సాంకేతిక బృందం ఆల్ హమీద్‌ను రక్షణ నిమిత్తం సోమాలియా తీరానికి దూరంగా తీసుకుని వెళ్లేందుకు సుమేథ సాయం అందించింది. ఈ సమయంలో ఆల్ హమీద్‌లో నౌక సిబ్బందితో పాటు 13 మంది భారతీయులు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇంతలో ఆల్ హమీద్ యజమాని మరమ్మతుల కోసం మరో నౌకను పంపారు. ఈ నౌక ఆల్ హమీద్‌ను సురక్షితంగా పోర్టుకు తీసుకుని వెళ్లింది. ఈ క్రమంలో ఆల్ హమీద్ నౌకలోని సిబ్బంది సహా ఇతరులకు భారత గస్తీ యుద్ధ నౌక సుమేథ సిబ్బంది తాగేందుకు మంచినీరు, అవసరమైన మందులు అందజేశారు.
'చిత్రం... సముద్రంలో మరమ్మతులకు గురైన సంప్రదాయ నౌక ఆల్ హమీద్