రాష్ట్రీయం

సార్వత్రిక సమ్మెకు కేసీఆర్ నాయకత్వం వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: దేశవ్యాప్తంగా ఈ నెల 8వ తేదీన జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. మఖ్దూం భవన్‌లో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్‌పాషాలతో కలిసి మాట్లాడారు. కేంద్రప్రభుత్వ రైతాంగ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతోందని, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరి చెప్పాలని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం వద్ద పణంగా పెడతారా? లేదా పోరాడతారా అనేది స్పష్టం చేయాలని పేర్కొన్నారు. బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని , సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని, 31మందికి పైగా ఈ ఉద్యమాల్లో చనిపోయారని, సీఏఏకు వ్యతిరేకంగా ఓటు వేసిన టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో మాత్రం ఆందోళనలను అణచివేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ వైఖరిని ఇప్పటికైనా స్పష్టం చేయాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వామపక్షాలు, కలిసి వచ్చే లౌకిక పార్టీలతో కలిసి పోటీ చేస్తామని, జిల్లా స్థాయిలో సర్దుబాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
జేఎన్‌యూ ఘటనను ప్రస్తావిస్తూ ఈ దాడిపై న్యాయ విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు. జేఎన్‌యూ అమానుష ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌సైతం స్పందించిందని అన్నారు. వీసీని వెంటనే బర్త్ఫ్ చేయాలని, ఢిల్లీ పోలీసు కమిషనర్‌నూ బర్త్ఫ్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. పకడ్బందీ సెక్యూరిటీ ఉండే యూనివర్శిటీల్లో గుర్తింపు కార్డులేని వారిని వీసీ అనుమతి లేనిదే ఎవరినీ అనుమతించరని అలాంటిది 50 మంది ముసుగులు ధరించిన వారు యూనివర్శిటీలోకి ఎలా ప్రవేశించారని నిలదీశారు. కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం కేసు పెట్టారని, ఓ మైనార్టీ రీసెర్చి స్కాలర్ మూడేళ్లుగా కనిపించడంలేదని అనేకమంది నేతలపైనా ప్రొఫెసర్లపైనా ఆంక్షలు విధించారని గుర్తుచేశారు.
'చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్‌పాషా