రాష్ట్రీయం

శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, ఫిబ్రవరి 26: శ్రీశైలం జలాశయాన్ని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ బుధవారం సందర్శించారు. బోర్డు నూతన చైర్మన్‌గా నియమతులైన అయన జలాశయాల పరిశీలనలో భాగంగా శ్రీశైలం డ్యామ్‌ను పరిశీలించారు. అయనకు డ్యాం అధికారులు ఘనస్వాగతం పలికారు. ముందుగా తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన అయ్యర్ అనంతరం ఆంధ్ర పరిధిలోని కుడిగుట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
డ్యాం గ్యాలరీ, గేట్ల నిర్వహణ, నీటి నిల్వల వివరాలను డ్యామ్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ శ్రీశైలం డ్యామ్ నిర్వహణ సంతృప్తికరంగా ఉందన్నారు. అనంతరం శ్రీశైలం చేరుకున్న అయ్యర్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. అయన వెంట కృష్ణా రివర్ బోర్డు మెంబర్ కార్యదర్శి పరమేష్, అశోక్‌కుమార్, శివశంకరయ్య, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ఎస్‌ఈ నరసింహారావు, భూగర్భ విద్యుత్ కేంద్రం ఎస్‌ఈ మంగేష్‌కుమార్, డ్యామ్ అధికారులు వెంకటరమణ, సేనానంద్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... శ్రీశైలం జలాశయం గ్యాలరీని తనిఖీ చేస్తున్న కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్