రాష్ట్రీయం

విశాఖలో కరోనా అనుమానిత కేసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు సంబంధించి విశాఖ నగరంలో ఓ అనుమానిత కేసు నమోదైంది. విశాఖ నగరానికి చెందిన 18 ఏళ్ల మెడికల్ విద్యార్థిని చైనాలో చదువుతోంది. రెండు రోజుల క్రితం చైనా నుంచి విశాఖ నగరానికి వచ్చిన నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో విశాఖ ఎయిర్ పోర్టులో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, అక్కడి నుంచి తక్షణమే వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యాధికారులు తక్షణమే ఆమెను కరోనా వార్డులో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. ఆమె చైనా నుంచి వచ్చే సమయంలో పలు ఎయిర్‌పోర్ట్‌ల్లో తిన్న ఆహారం ఫుడ్‌పాయిజన్ కావడంతోనే ఈ సమస్య ఏర్పడి ఉంటుందని, ఇప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితిపై రక్తపరీక్షలు నిర్వహించి వాటిని హైదరబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్‌కు పంపామని జిల్లా కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పార్థసారధి ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, బుధవారం నాటికి వైరాలజీ ల్యాబ్ రిపోర్ట్ వస్తుందని ఆ తరువాత ఆమెను డిశార్జి చేస్తామని ఆయన తెలిపారు. అయితే కరోనా వైరస్‌పై అనుమానిత కేసు విశాఖలో నమోదైన నేపథ్యంలో ఆరోగ్యశాఖాధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతున్నారు.