రాష్ట్రీయం

427 రైల్వే స్టేషన్లలో మొబైల్ వైఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో పాటు విద్యుదీకరణ రైళ్ల పరుగులకు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌గోయల్ ప్రారంభించనున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రిమోట్ వీడియో లింక్‌తో సంబంధిత కార్యక్రమాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి కిషణ్‌రెడ్డితో కలసి పీయూష్‌గోయల్ పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 427 రైల్వే స్టేషన్లలో ఉచిత మోబైల్ వైఫైని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో శాటిలైట్ టర్మినల్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గుంతకల్ రైల్వే డివిజన్‌లో కడప జిల్లా ఎర్రగుంట్ల- నంద్యాల మధ్య రైల్వే ట్రాక్‌పై విద్యుదీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గుంతకల్- కల్లూరు మధ్య డబ్లింగ్‌తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తి కావడంతో ఆ మార్గంలో రైళ్ల పరుగులు తీయడానికి మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. జోన్ పరిధి వౌళిక వసతులతో పాటు ప్రయాణికుల సౌకర్యం కోసం పెద్దపీట వేయనున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయా నియోజక వర్గ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు స్థానిక నేతలకు వ్యక్తిగతంగా రైల్వే అధికారులు ఆహ్వానాలను పంపారు.