రాష్ట్రీయం

ప్లాస్టిక్ రహితంగా తిరుమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరపతి, ఫిబ్రవరి 17: తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధించడంలో భాగంగా ఇకపై తాగునీటిని గాజు సీసాలలో విక్రయించే విధానానికి టీటీడీ ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టనుంది. బుధవారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. అయితే ఇప్పటివరకు తిరుమలలో భక్తులు రూ. 20లేదా 25 చెల్లిస్తే లీటరు నీటి బాటల్‌ను కొనుగోలు చేస్తే తన వెంట ఎక్కడికైనా తీసుకువెళ్లే అవకాశం ఉండేది. అయితే ప్లాసిక్ వాడకాన్ని నియంత్రంచడంలో భాగంగా టీటీడీ సదరు ప్లాస్టిక్ నీటి బాటల్ సరఫరా చేస్తున్న సంస్థకే గాజు సీసాలలో సరఫరా చేసే అవకాశాన్ని ఇచ్చింది. అయితే దీనిలో మతలబు ఏమిటంటే లీటరు నీరు కావల్సిన భక్తుడు గాజు సీసాలో నీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని నిమిత్తం రూ. 40 భక్తుడు చెల్లించాల్సి ఉంటుంది. గాజు సీసాలో ఉన్న నీటిని వాడుకుని తిరిగి ఆ దుకాణదారుడికి ఖాళీ సీసాను అప్పగిస్తే తిరిగి రూ. 20 చెల్లిస్తాడు. ఒకవేళ భక్తుడి చేతిలో పొరపాటున నీరు తాగే సమయంలో బాటిల్ జారవిడిచి అది పగిలిపోతే లీటరు నీటి ధర రూ. 40లు ఆర్థిక భారం భక్తుడిపై పడుతుంది. తిరుమల తిరుపతికి వచ్చే
భక్తులకు టీటీడీ ఎన్ని సౌకర్యాలు కల్పిస్తుందో కొంత మంది ఆలోచన విధానాలతో కొత్త ఇబ్బందులు సృష్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీటీడీ ఆరోగ్య విభాగం అధికారి సోమవారం తనను కలసిన విలేఖరులతో మాట్లాడుతూ బుధవారం నుండి గాజు నీటి విక్రయించే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాగి సీసాలు, మట్టి సీసాల్లో నీటి విక్రయించే విధానాన్ని సాగించాలని టీటీడీ యోచించినా రాగి సీసా ధర అధికంగా ఉండటం, మట్టి సీసాలు అందుబాటులో లేకపోవడంతో ఈ విధానాలు తిరుమలలో నామమాత్రంగానే అమలవుతున్నాయి. అయితే ఏడాది కాలంగా తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడాన్ని టీటీడీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా తాగునీటి సరఫరాను భక్తులకు ఎక్కువగా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేసింది. సామాన్య భక్తుల నుంచి సంపన్నులు బస చేసే ప్రధానమైన అతిథి భవనాల వద్ద ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే కొంత మంది వీఐపీ, వీవీఐపీలు తాను వాహనాల్లో తిరుమలకు వస్తూ తమ వెంట ప్లాస్టిక్ నీటిని తీసుకువస్తున్నారు. అయితే వాటిని సైతం నియంత్రించడం కోసం టీటీడీ యాజమాన్యం తిరుమలలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉంది. లీటర్ బాటిల్ ధరను రూ. 40 రూపాయలుగా నిర్ణయించడం సరి కాదనే వాదన సామాన్య భక్తుల నుంచి వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఆరోగ్య విభాగం అధికారి ఆర్‌ఆర్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమలలో శీతల పానీయాలను గతంలో గాజు సీసాల్లో విక్రయించేవారని, అప్పుడు భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని ఆయన గుర్తు చేశారు. అలాగే గాజు సీసాలో నీటిని విక్రయం జరిగినా ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నామన్నారు. ఇది ప్రయోగాత్మకంగా చేపడుతున్న విషయమే తప్పా మరొకటి కాదన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి వ్యతిరేకమైన అంశాలు వచ్చినా టీటీడీ యాజమాన్యం సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటికే సామాన్య భక్తుల కోసం ఎక్కడికక్కడ ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశామని అందుకు సంబంధించి గ్లాసులను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా భక్తులు అవసరమనుకుంటే తప్ప గాజు సీసాల్లోని నీటిని కొనుగోలు చెయ్యరని భావిస్తున్నామన్నారు.

*చిత్రం... రేపటి నుంచి అందుబాటులోకి రానున్న గాజు సీసాలు, రాగి సీసాలు, మట్టి సీసాలు