రాష్ట్రీయం

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బొమ్మిరెడ్డి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఫిబ్రవరి 6: ప్రజావైద్యుడిగా, పేదల నాయకుడిగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి (85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఆత్మకూరు పట్టణంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వయోభారంతో అనారోగ్యానికి గురైన ఆయన నెల్లూరులో వైద్యచికిత్స పొంది ఇటీవలనే ఆత్మకూరులోని స్వగృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటూ గురువారం ఉదయం మృతిచెందారు. ఈయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఈయన కుమారుడు రాఘవేంద్రరెడ్డి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు.